ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం!
చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంత పరిపాలన విభాగం 2026-27 ఆర్థిక ఏడాదికి సంబంధించి సరికొత్త ఎక్సైజ్ పాలసీని ఖరారు చేసింది. ఈ నూతన విధాన ప్రకారం.. మద్యం విక్రయాలను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకు కేవలం వైన్ షాపులకే పరిమితమైన మద్యం విక్రయాలు, ఇకపై పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, స్థానిక మార్కెట్లలోనూ అందుబాటులోకి రానున్నాయి.
అందుబాటులోకి విదేశీ మద్యం
నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై సామాన్య ప్రజలు సరుకులు కొనుగోలు చేసే డిపార్ట్మెంటల్ స్టోర్లలోనే విదేశీ మద్యం, వైన్, బీర్లను కొనుగోలు చేయవచ్చు. దీని వల్ల వినియోగదారులకు కావాల్సిన బ్రాండ్లు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి.చండీగఢ్ అంతటా 97 మద్యం దుకాణాలకు అనుమతులు ఇస్తూ.. ఇకపై బాట్లింగ్ ప్లాంట్లు వారానికి 6 రోజుల పాటు పనిచేయడానికి అనుమతి లభించింది. మరోవైపు భారతీయ మద్యం, బీర్, వైన్ ధరలపై 2 శాతం వరకు పెరుగుదల ఉండొచ్చని అంచనా.

డిజిటల్ విప్లవం
మద్యం విక్రయాల్లో అవినీతిని తగ్గించి పారదర్శకతను పెంచడేందుకు ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను తప్పనిసరి చేసింది. ప్రతి మద్యం దుకాణంలో కార్డ్ పేమెంట్స్, పీఓఎస్ మిషన్లు ఉండాలి. నగదు రహిత లావాదేవీల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో లెక్కలు స్పష్టంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే కాకుండా మద్యం రవాణా చేసే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా సరఫరాలో ఎటువంటి అక్రమాలు జరగకుండా నిఘా పెట్టామన్నారు.
ఆల్కహాల్ మీటర్లు
ఈ ఎక్సైజ్ పాలసీలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమటంటే ఆల్కహాల్ మీటర్ల ఏర్పాటు. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లలో మద్యం సేవించే వారు తాము ఎంత మోతాదులో తాగారో స్వయంగా పరీక్షించుకోవడానికి ఈ యంత్రాలను అందుబాటులో ఉంచాలి. ప్రజలు తమ పరిమితిని మించకుండా చూసుకోవాలని.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను తీసుకువచ్చారు. దీంతో పాటు అన్ని విక్రయ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాల ద్వారా లైవ్ మానిటరింగ్ నిర్వహించి.. భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.
ప్రభుత్వ ఉద్దేశం ఇదే..
మద్యం విక్రయాలను వ్యవస్థీకృత మార్కెట్లలోకి తీసుకురావడం ద్వారా అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వినియోగదారులకు సురక్షితమైన, క్రమబద్ధమైన వాతావరణంలో మద్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించడమే ఈ కొత్త పాలసీ ప్రధాన లక్ష్యం. అయితే పెట్రోల్ బంకుల్లో మద్యం విక్రయాల నిర్ణయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications