పిల్లల ప్రాణాలు తీసే కొత్త వైరస్: లక్షణాలు ఇవే: ఈ మూడు రాష్ట్రాల్లో వ్యాప్తి..
Chandipura virus: భారత్‌తో పాటు ప్రపంచ దేశాలను సుమారు మూడు సంవత్సరాల పాటు గడగడలాడించింది.. ప్రాణాంతక కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది దీని బారిన పడ్డారు. అదే సంఖ్యలో మరణించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దీని తీవ్రత తగ్గింది. అంతే తప్ప పూర్తిగా మటుమాయం కాలేదు.
ఈ పరిస్థితుల్లో మరో కొత్త వైరస పుట్టుకొచ్చింది. గుజరాత్‌లో వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ విస్తరిస్తోంది. పొరుగునే ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకూ పాకింది. చండీపురా వైరస్‌గా దీన్ని గుర్తించారు. ఇప్పటివరకు ఒక్క గుజరాత్‌లోనే 13 మంది మరణించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లల్లో ఒకరు చొప్పున మృతిచెందారు. 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఈ వైరస్- ఎక్కువగా పిల్లలకు సంక్రమిస్తోండటం ఆందోళనకరంగా పరిణమించింది. మృతుల్లో కూడా అందరూ చిన్న పిల్లలే. గుజరాత్‌లోని సబర్కాంత-4, ఆరావలి- 4, మహీసాగర్- 1, ఖేడా- 1, మెహసానా- 2, రాజ్‌కోట్- 1, సురేంద్రనగర్ 2, అహ్మదాబాద్- 1, పంచమహల్- 2, గాంధీనగర్- 4, జామ్‌నగర్- 2, మోర్బీ- 3ల్లో కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్- 2, మధ్యప్రదేశ్‌లోని ధార్- 1 కేసు వెలుగులోకి వచ్చింది.
1964లో తొలిసారిగా మహారాష్ట్రలో ఈ వైరస్ కనిపించింది. అక్కడి చండీపురాలో దీన్ని గుర్తించారు. అందుకే దీనికి ఆ పేరే పెట్టారు. అప్పట్లోనూ పెద్ద ఎత్తున మరణాలు నమోదయ్యాయి. ఆ తరువాత మళ్లీ దీని జాడలేదు. ఇప్పుడు గుజరాత్‌లో ఆందోళనరకంగా విస్తరిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని కట్టడి చేయడానికి గుజరాత్ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోంది.
ఇదొక ఆర్ఎన్ఏ వైరస్. వెసిక్యులర్ వైరస్‌గా పిలుస్తారు. రాబ్డోవిరిడే కుటుంబానికి చెందినది. రేబిస్ కూడా ఈ కుటుంబానికి చెందినదే. ప్రధానంగా ఫ్లెబోటోమైన్ శాండ్‌ఫ్లైస్, పేలు, దోమల ద్వారా ఇది వ్యాపిస్తుంది. పిల్లలు ఎక్కువగా దీని బారిన పడుతున్నట్లు గుజరాత్ వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
హఠాత్తుగా విపరీతమైన జ్వరం రావడం దీని ప్రధాన లక్షణం. ఈ వైరస్ సోకిన వాళ్లు తీవ్రమైన తలనొప్పి గురి అవుతారు. వాంతులు కావడం, మూర్ఛ పోవడం, మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్తారు. సకాలంలో వైద్యం అందకపోతే మరణిస్తారు.
చండీపురా వైరస్‌ను నియంత్రించడానికి నిర్దుష్టమైన చికిత్స గానీ, వ్యాక్సిన్ గానీ లేదు. అందుబాటులో ఉన్న ట్రీట్‌మెంట్ ద్వారానే దీన్ని అరికట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి జ్వరాన్ని తగ్గించే మందులను వాడుతున్నారు డాక్టర్లు. నాడీ వ్యవస్థ దెబ్బతినకుండా, శ్వాసకోశ, నరాల సంబంధిత ఇబ్బందులు తలెత్తకుండా ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications