రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు, ఒడిశా సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణస్వీకారం..!
దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, ఒడిశాలో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఏపీలో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఉదయం ప్రమాణస్వీకారం చేయనుండగా.. సాయంత్రం ఒడిశా ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత మోహన్ మాంఝీ ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ రెండు కార్యక్రమాలకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు.
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎంపికైన చంద్రబాబు రేపు గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు మంత్రులుగా పవన్ కల్యాణ్, ఇతర ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు అమిత్ షా హాజరవుతున్నారు. అలాగే చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులకూ ఆహ్వానాలు అందాయి.

మరోవైపు ఒడిశాలో తొలిసారి అధికారం చేపడుతున్న బీజేపీ ఆదివాసీ నేత అయిన నాలుగు సార్లు ఎమ్మెల్యే మోహన్ మాంఝీకి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది. ఆయనతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా రేపు సాయంత్రం భువనేశ్వర్ లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికీ మోడీ, అమిత్ షా హాజరవుతారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ శకానికి చెక్ పెట్టిన బీజేపీ తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుండటంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం ఏర్పడింది.












Click it and Unblock the Notifications