ఇంకా ఎన్నో: బడ్జెట్‌పై చంద్రబాబు, కేసీఆర్‌కు లేఖ రాస్తా
హైదరాబాద్: కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం తొలి ఏడాది బడ్జెట్ బాగా చేసిందని, ఇంకా చేయాల్సి ఉందన్నారు. ఈ బడ్జెట్ అభివృద్ధి కోణంలో ముందుకు తెచ్చారని చెప్పారు.
వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి పెంపు మంచిదన్నారు. ఐఐటీ, ఐఐఎంలు విజ్ఞాన సమాజంలో ముందడుగు అని కొనియాడారు. కాకినాడ హార్డ్ వేర్ పార్కు ద్వారా నిరుద్యోగ సమస్యను తొలగించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం జైట్లీ తాపత్రయపడ్డారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చేందే వరకు కేంద్రం సహకరించాలని కోరారు. ఆర్థిక సమానతలు తొలగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. బడ్జెట్‌లో పారిశ్రామిక ప్రగతి పైన దృష్టి సారించారన్నారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌తో ఏపీకి ఉపయోగమన్నారు.
రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఎం తదితర సంస్థల ఏర్పాటు హర్షణీయమన్నారు. అయితే ఇంకా ఎన్నో సంస్థలు రావాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని, వీటి నుండి విజయవంతంగా బయటపడతామన్నారు. దేశంలో తిరోగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం ఎన్డీయే చేసిందన్నారు.

తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రాష్ట్రంగా మారుతుందన్నారు. గుజరాత్ మాదిరిగా ఏపీ కూడా అభివృద్ధి పథంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమస్యలను అధిగమించేలా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఇక నుండి తాను వారానికి రెండు రోజులు జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు.
బోధనా రుసుం, ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పైన తెలంగాణ సీఎం కేసిఆర్‌కు లేఖ రాస్తానని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు రానున్నాయని, అభివృద్ధి చేసి తీరుతామన్నారు. మౌలిక సదుపాయాల రూపకల్పనకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవడం సరైనదే అన్నారు. సంక్షోభాన్ని సదవకాశంగా మార్చుకునే నేర్పు తనకు ఉందని చెప్పారు.
ద్రవ్యోల్భణం తగ్గుతోంది: రాజన్
దేశంలో ద్రవ్యోల్భణం క్రమంగా తగ్గుతోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ ముంబైలో అన్నారు. కేంద్ర బడ్జెట్ పైన ఆయన మాట్లాడుతూ.. గృహ రుణాలపై ఇచ్చే వడ్డీ రేట్లు తగ్గవచ్చునని చెప్పారు.
మంచి బడ్జెట్: అద్వానీ
జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ తాను చూసిన మంచి బడ్జెట్ అని బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఢిల్లీలో అన్నారు. ఆర్థిక వ్యవస్థను సంస్కరించేందుకు జైట్లీ చక్కటి ప్రయత్నం చేశారని కొనియాడారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications