ఢిల్లీలో బాబు బిజీ: మోడీతో భేటీ, ప్యాకేజీపైనే..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరిక లేకుండా భేటీలతో గడుపుతున్నారు. ఆయన సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ వంటి అంశా్లపై ఆయన ప్రధానితో చర్చించారు. రాజధాని నిర్మాణంతో పాటు రూ.15 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీపై ఆయన ప్రధానితో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయమే ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయంలోనే కేంద్రమంత్రి రాథా మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా విభజన సమస్యలు, ఇతర అంశాలు చర్చించారు.

సోమవారం సాయంత్రం 5-30 గంటలకు కేంద్రమంత్రి సిమ్రత్ కౌర్‌తో భేటీ అవుతారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఈ నాలుగు కార్యక్రమాలు ఖరారు అయినట్లుగా తెలియవచ్చింది.
రాష్ట్ర రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుందని భావిస్తున్నారు. చంద్రబాబు గుంటూరు - విజయవాడ మధ్యన రాజధానిని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications