వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీపై పోరు ... మమతా బెనర్జీకి మద్దతుగా పశ్చిమ బెంగాల్ లో ప్రచారం చెయ్యనున్న చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

Recommended Video

పశ్చిమబెంగాల్ లో మమతకు మద్దతుగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం || Oneindia Telugu

ఒకపక్క ఏపీలో ప్రస్తుతం సీఎంగా ఉన్నా అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్న ఏపీ సీఎం చంద్రబాబు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మద్దతుగా రేపు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కోసం ప్రచారం చేసిన దీదీ కోసం చంద్రబాబు రంగంలోకి దిగనున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

పశ్చిమ బెంగాల్ లో చంద్రబాబు ప్రచారం .. మమతకు మద్దతుగా నేడు రేపు ఎన్నికల ప్రచారం

పశ్చిమ బెంగాల్ లో చంద్రబాబు ప్రచారం .. మమతకు మద్దతుగా నేడు రేపు ఎన్నికల ప్రచారం

పశ్చిమ బెంగాల్ లో ఝర్ గ్రామ్ , హల్దియా, కోల్‌కతా, ఖరగ్‌పూర్ ప్రాంతాల్లో నిర్వహించే సభల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి చంద్రబాబు పాల్గొంటారు. నేడు పశ్చిమబెంగాల్ వెళ్లనున్న చంద్రబాబు నేడు రెండు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు . ఝర్ గ్రామ్ , హల్దియా లలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు .రాత్రికి హల్దియాలోనే బస చేస్తారు. రేపు ఖరగ్ పూర్ లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం దేశ రాజకీయాల్లో తాజా పరిణామాలపై, బీజేపీయేతర కూటమిపై చర్చించేందుకు ఇరు ముఖ్యమంత్రులు భేటీ అవుతారు . రేపు రాత్రి తిరిగి చంద్రబాబు ఏపీకి చేరుకుంటారు.

మమతాబెనర్జీతో బీజేపీయేతర కూటమిపై చర్చించనున్న చంద్రబాబు

మమతాబెనర్జీతో బీజేపీయేతర కూటమిపై చర్చించనున్న చంద్రబాబు

ఇప్పటికే చంద్రబాబు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులలో మిత్రపక్షాలకు మద్దతిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ సర్కార్ పై పోరాటం చేస్తున్న మమతా బెనర్జీకి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఒకపక్క ఫెడరల్ ఫ్రంట్ కోసం తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా పావులు కదుపుతుంటే చంద్రబాబు కూడా మరోమారు మమతాబెనర్జీతో బీజేపీయేతర కూటమిపై చర్చలు జరపనున్నారు.

అడుగడుగునా ఇబ్బందులు ఉన్నా మోడీకి చెక్ పెట్టే వ్యూహంలో చంద్రబాబు

అడుగడుగునా ఇబ్బందులు ఉన్నా మోడీకి చెక్ పెట్టే వ్యూహంలో చంద్రబాబు

ప్రతిపక్షాలను అన్నింటిని ఏకం చేసి, మోడీని గద్దె దించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అయితే ఎన్నికల ముందు బీజేపీయేతర కూటమిలో కీలక భూమిక పోషించిన చంద్రబాబు మోడీకి చెక్ పెట్టటానికి ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ముందుకు పోయే వ్యూహం రచించారు . కానీ అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాబు ఏ మేరకు సక్సెస్ అవుతారో .

English summary
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu will participate in poll rallies of his West Bengal counterpart, TMC supremo Mamata Banerjee in the state. Naidu will arrive here Wednesday morning and participate in two campaign rallies of Banerjee one scheduled at Jhargram and the second at Haldia. After spending Wednesday night at Haldia, Naidu, who is also the Telegu Desam Party president, will speak at another campaign rally at Kharagpur the next day, After the meeting in Kharagpur, both the chief ministers will head towards Kolkata where they are likely to have a close door meeting on Thursday evening, he said adding Naidu is scheduled to leave that night itself, the source said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X