బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Chandrayaan 2 : ఇప్పటివరకూ చంద్రుడి చుట్టూ 9వేల ఆర్బిట్స్... ఇస్రో కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

రెండేళ్ల క్రితం భారత్ ప్రయోగించిన చంద్రయాన్-2 అంతరిక్ష నౌక చంద్రుడి చుట్టూ ఇప్పటివరకూ 9వేల ఆర్బిట్స్ పూర్తి చేసినట్లు ఇస్రో వెల్లడించింది. అంతరిక్ష నౌకలోని సాంకేతిక టెక్నాలజీతో చంద్రుడి ఉపరితలానికి సంబంధించి కీలక డేటా అందుతోందని తెలిపింది. ఇస్రో ఛైర్మన్ కె.శివన్ ఈ విషయాలు వెల్లడించారు. చంద్రయాన్-2 ప్రయోగానికి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో బెంగళూరులో రెండు రోజుల పాటు లూనార్ సైన్స్‌పై ఇస్రో వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. సోమవారం(సెప్టెంబర్ 6) ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా శివన్ మాట్లాడారు.

Blushing beauty Nivetha Thomas: బ్యూటిఫుల్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న మలయాళ కుట్టి (ఫొటోస్)Blushing beauty Nivetha Thomas: బ్యూటిఫుల్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న మలయాళ కుట్టి (ఫొటోస్)

చంద్రయాన్-2లోని అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ చంద్రుడి ఉపరితలం నుంచి 100కి.మీ ఎత్తు వరకు ఉన్న వాతావరణాన్ని పరిశీలిస్తోందని శివన్ తెలిపారు.ఈ మిషన్‌కు సబంధించి కొన్ని కీలక డాక్యుమెంట్లను వర్క్‌షాపులో విడుదల చేశారు. ఇస్రో అపెక్స్ సైన్స్ బోర్డు ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ... చంద్రయాన్-1తో పోల్చితే చంద్రయాన్ 2 టెక్నాలజీ మరో స్థాయిలో ఉందని పేర్కొన్నారు. చంద్రుడి ఉపరితలంపై అబ్జర్వేషన్ల విషయంలో చంద్రయాన్ 2 పనితీరు అద్భుతంగా ఉందన్నారు.

chandrayaan 2 mission completes 9000 orbits around moon says isro

చంద్రయాన్ 2లోని అన్ని పరికరాలు,సబ్ సిస్టమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయని ప్రాజెక్ట్ డైరెక్టర్ వనిత తెలిపారు. రాబోయే చాలా ఏళ్ల పాటు చంద్రయాన్ 2 నుంచి మంచి డేటా అందుతుందని ఆశిస్తున్నామన్నారు.

రెండు రోజుల పాటు బెంగళూరులో నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్‌ను ఇస్రో వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు. అలాగే ఇస్రో ఫేస్‌బుక్ పేజీలోనూ లైవ్ వీక్షించవచ్చు. అంతరిక్ష పరిశోధనల పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు.. వారికి ఈ విషయాలను చేరువ చేసేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు.

జులై 22,2019న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్ 2ను జీఎస్ఎల్వీ ఎంకే3-ఎం1 రాకెట్ ద్వారా ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపించిన సంగతి తెలిసిందే.చంద్రయాన్-2లో మూడు పరికరాలను అమర్చారు.ఆర్బిటర్,ల్యాండర్,ల్యాండర్ రోవర్ అనే మూడు పరికరాలు ఇందులో ఉన్నాయి. ఇందులో ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగుతుంది.దీని నుంచి ల్యాండర్ రోవర్ అనే మూడో పరికరం చంద్రుడి మీద అన్వేషణ సాగిస్తుంది.ఈ రోవర్ చంద్రుడి ఉపరితలంపై గుర్తించే సమాచారాన్ని ల్యాండర్‌కు,అక్కడినుంచి ఆర్బిటర్‌కు చేరవేస్తుంది. ఆర్బిటర్ నుంచి అది భూమికి చేరుతుంది.

చంద్రయాన్ 2 అంతరిక్ష నౌకలో మొత్తం 13 పరిశోధన పరికరాలు ఉన్నాయి. నాసా పంపించిన పరికరాన్ని కూడా వీటికి జతచేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఈ పరిశోధన పరికరాలు అన్వేషణ సాగించి కీలక సమాచారాన్ని రాబట్టనున్నాయి.

English summary
ISRO has revealed that the Chandrayaan-2 spacecraft launched by India two years ago has so far completed 9,000 orbits around the moon. It said it was receiving key data related to the lunar surface with the technology in the spacecraft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X