చంద్రయాన్ 2: ప్రత్యక్షంగా వీక్షించనున్న ప్రధాని మోడీ, ఆ విద్యార్థులు కూడా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ చంద్రయాన్-2లో చోటు చేసుకోనున్న కీలక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగనున్న దృశ్యాలను ప్రధాని శుక్రవారం అర్ధరాత్రి దాటాక(శనివారం తెల్లవారుజామున) ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు.
'సెప్టెంబర్ 6న ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరుకు రానున్నారు. సెప్టెంబర్ 7న పీన్య సమీపంలోని ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్(ఐఎస్‌టీఆర్ఏసీ) ఇస్రో టెలీమీటర్ వద్ద ప్రధాని చంద్రయాన్ ల్యాండింగ్ దృశ్యాలను వీక్షించనున్నారు. అనంతరం అదే రోజున ముంబై బయల్దేరి వెళ్లనున్నారు' అని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోడీతోపాటు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 60-70మంది విద్యార్థులు చంద్రయాన్ 2 ల్యాండింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారని ఇస్రో తెలిపింది. ఇస్రో నిర్వహించిన ఆన్‌లైన్ స్పేస్ క్విచ్ పోటీలో టాప్ స్కోర్ సాధించిన విద్యార్థులను ప్రతీ రాష్ట్రం నుంచి ఇద్దరు చొప్పున ఎంపిక చేశారు. వీరంతా ప్రధానితోపాటు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగడాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
విక్రమ్( దీని లోపల ప్రజ్ఞాన్ రోవర్ ఉంటుంది) ల్యాండర్ సెప్టెంబర్ 7న అర్ధరాత్రి దాటిన తర్వాత ఉదయం 1.30, 2.30గంటల మధ్యలో చంద్రుడిపై అడుగుపెడుతుంది. దీంతో చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది. రష్యా, యూఎస్, చైనాల తర్వాత భారత్ ఈ ఘనతను సాధించింది. చంద్రుడి దక్షిణార్థ గోళంలో అడుగుపెట్టే మిషన్ మాత్రం భారతే కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications