Chandrayaan 3: భూమికి బైబై- అంతరిక్ష ప్రయాణంలో కీలక మలుపు

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. మరో కీలక దశను అధిగమించింది. భూకక్ష్యను దాటుకుంది. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావంలోకి పంపించడానికి చంద్రాయన్ 3 కక్ష్యను మరింత పెంచింది ఇస్రో. ఈ సాయంత్రం సరిగ్గా 6:59 నిమిషాలకు చంద్రుడి ఆర్బిట్‌లోకి ప్రవేశించింది. ఇప్పటి నుంచి చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది.

కిందటి నెల 14వ తేదీన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి చంద్రయాన్ 3 నింగి వైపు దూసుకెళ్లిందిన విషయం తెలిసిందే. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో- ఈ మూన్ మిషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో.

 Chandrayaan-3

చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3,900 కేజీలు. చంద్రుడి కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్- పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పేలోడ్‌ను ఈ రాకెట్‌తో పాటు పంపించారు.

ఈ నెల 23వ తేదీన సరిగ్గా సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రయాన్ 3.. జాబిల్లి మీద కాలు మోపుతుంది. ల్యాండింగ్ కోసం చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఎంచుకుంది ఇస్రో. నింగిలోకి దూసుకెళ్లిన ఈ స్పేస్ క్రాఫ్ట్ 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణం సాగించాల్సి ఉంది. ఇందులో భాగంగా అయిదు దశల్లో భూకక్ష్యను అధిగమించింది. 22 రోజుల వ్యవధిలో భూకక్ష్యను దాటుకుంది.

ఇప్పటివరకు 2,60,369 కిలోమీటర్ల మేర ఈ రాకెట్ అంతరిక్ష ప్రయాణాన్ని సాగించింది. చంద్రుడిని చేరుకోవడానికి ఇంకో లక్షా 24 వేల కిలోమీటర్ల మేర ప్రయాణం సాగించాల్సి ఉంది. ఈ నెల 23వ తేదీన సాయంత్రానికి చంద్రుడి ఉపరితలానికి సమీపిస్తుంది. ఆ సమయంలో క్రాష్ ల్యాండింగ్ కాకుండా ఇస్రో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.

చంద్రయాన్ 3 ఇప్పుడున్న వేగంతోనే ప్రయాణిస్తే.. క్రాష్ ల్యాండింగ్ తప్పదు. అందుకే- దాని వేగాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. జాబిల్లి ఉపరితలం మీద సవ్యంగా దిగాలంటే.. చంద్రయాన్ 3 వేగాన్ని జీరో కిలోమీటర్లకు తీసుకుని రావాల్సి ఉంటుంది. అదే ఈ ప్రక్రియ మొత్తానికీ అత్యంత కీలక ఘట్టం.

ఎందుకంటే- 2019లో ప్రయోగించిన చంద్రాయన్ 2 క్రాష్ ల్యాండింగ్‌కు గురైన విషయం తెలిసిందే. చంద్రుడిపై ల్యాండింగ్ చేసే సమయంలో దాని వేగాన్ని నియంత్రించడంలో ఇస్రో విఫలమైంది. ఫలితంగా వేల కిలోమీటర్ల వేగంతో నేరుగా చందమామ ఉపరితలాన్ని ఢీకొట్టింది. ముక్కలైపోయింది. ఆ చేదు ఘటన పునరావృతం కాకుండా ఇస్రో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+