వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Punjab Elections 2022 : వ్యూహం మార్చిన కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ సీఎం- ఆప్ హవాతో మార్పు

|
Google Oneindia TeluguNews

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోరు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ లో అధికార కాంగ్రెస్ ను గద్దెదింపే విషయంలో బీజేపీ, ఇతర పార్టీలతో పోలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతో ముందుంది. ఎలాంటి హంగామా లేకుండానే ఆమ్ ఆద్మీ పేరుతో ఆ పార్టీ సృష్టిస్తుున్న సునామీ కాంగ్రెస్ ను బలంగా తాకుతోంది దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో మార్పు చేసుకుంటోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రం పంజాబ్ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపే అవకాశం ఉందంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తమ సీఎం అభ్యర్ధి చరణ్ జీత్ సింగ్ చన్నీని ఆమ్ ఆద్మీ సీఎంగా ప్రయోగిస్తోంది. బడుగు, బలహీన వర్గానికి చెందిన చన్నీని సీఎం అభ్యర్ధిగా నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దళితులతో పాటు ఇతర వర్గాల మద్దతు లభిస్తుందని ఆశాభావంగా ఉంది. దీంతో ఇప్పుడు చన్నీని చూపిస్తూ పంజాబ్ లో మరోసారి ఓటు అడుగుతోంది. దీంతో బీజేపీ వంటి పార్టీలకు ఇది ఇబ్బందికరంగా మారుతోంది.

change in punjab congress strategy to aam admi cm with aaps poll narrative leads the election

Recommended Video

Punjab Elections 2022: Congress లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు AAP కు వరం | Oneindia Telugu

కాంగ్రెస్ అంతర్గత అంచనాల తర్వాత రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాల్ని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. 2022 పంజాబ్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమకు అసలు పోటీదారుగా ఎదుగుతుందని కొంతమంది సీనియర్ రాష్ట్ర పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ నిన్న మొన్నటి వరకు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు, జలంధర్‌లో, కాంగ్రెస్ నాయకుడు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేసి, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో.ప్రజల కోసం మీరు ఏమి చేశారని ప్రశ్నించారు. దీంతో ఆప్ పై కాంగ్రెస్ పార్టీ ఎంతగా గురిపెట్టిందో అర్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆప్‌పై దాడి మొదలుపెట్టారు. ఆప్ ను ఆమె బిజెపి యొక్క బి టీమ్ గా అభివర్ణిస్తున్నారు.
.

English summary
after aam admi party's poll narrative in punjab assembly elections, congress party has changed its plan and now campaign on aam admi cm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X