బీజేపీ వ్యూహం వెనుక..: శశికళ డౌట్, పావుగా పన్నీరుసెల్వం

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో, ముఖ్యంగా అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను బీజేపీ క్యాష్ చేసుకోవాలని చూస్తోందా? అదును చూసి తమిళనాడులో వేళ్లూనుకునే ప్రయత్నం చేస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

కొత్త ట్విస్ట్: తమిళనాడు సీఎంగా పన్నీరుసెల్వం, పళనికి డిప్యూటీ..?

జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేకు దగ్గర కావడం ద్వారా తమిళనాట పట్టు బిగించాలని చూసింది. కానీ శశికళ వారి వ్యూహాలను తిప్పికొట్టారు. ఇప్పుడు శశికళ, దినకరన్‌లు చిక్కుల్లో ఉండటంతో మరోసారి బీజేపీ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.

అండగా నిలిచి వేళ్లూనుకోవాలని.. వేచి చూసిన బీజేపీ

అండగా నిలిచి వేళ్లూనుకోవాలని.. వేచి చూసిన బీజేపీ

జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేకు అండగా నిలవడం ద్వారా తమిళనాడుల వేళ్లూనుకోవాలని బీజేపీ పావులు కదిపింది. సీఎం పన్నీర్‌సెల్వంకు బాసటగా నిలుస్తూ రాజకీయంగా రాజబాట వేసుకోవాలని భావించింది. అయితే బీజేపీ అంచనాలు తారుమారుకాగా శశికళ వర్గం అధికారంలోకి వచ్చింది.

ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లినా పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారకపోగా రాజకీయంగా పన్నీర్‌సెల్వం మరింత బలహీనపడిపోయారు. ఇక పూర్తిగా కార్యాచరణలోకి దిగిన కేంద్రం అదనుకోసం వేచి చూసింది.

దినకరన్ దొరకడం.. గవర్నర్ చెన్నైకి రావడం..

దినకరన్ దొరకడం.. గవర్నర్ చెన్నైకి రావడం..

ఇదే సమయంలో దినకరన్‌ పలు కేసుల్లో ఇరుక్కోవడం కేంద్రానికి వరంగా మారింది. అవినీతి ఆరోపణల్లో అధికార పార్టీ అడ్డంగా దొరికిపోవడం రాష్ట్రపతి పాలనకు దారి తీస్తుందనే భయం శశికళ వర్గంలో కనిపించిందంటారు. ఈ భయానికి ఊతమిస్తూ ఇంచార్జి గవర్నర్‌ విద్యాసాగర రావు నాలుగురోజుల క్రితం అకస్మాత్తుగా చెన్నైకి చేరుకున్నారు.

అప్పటి నుంచి బీజేపీ టార్గెట్.. చిన్నమ్మ మదిలో అనుమానం

అప్పటి నుంచి బీజేపీ టార్గెట్.. చిన్నమ్మ మదిలో అనుమానం

పన్నీర్‌సెల్వం దూరమైన నాటి నుండే తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్రం టార్గెట్‌ చేసిందని శశికళ వర్గం అనుమానిస్తోంది. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు డీఎంకే ఒకవైపు పొంచి ఉంది. మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తే మనుగడ లేదని శశికళ వర్గం నేతలకు తెలుసు.

చేజేతులా అధికారాన్ని చేజార్చుకునే కంటే శశికళ, దినకరన్‌లపై వేటు వేయడం ద్వారా పన్నీర్‌ సెల్వంతో రాజీపడితే కేంద్రంతో సత్సంబంధాలు, ఎంజీఆర్‌ స్థాపించిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం కూడా దక్కుతాయని సీఎం పళనిస్వామి వర్గం భావించిందని చెబుతారు.

పన్నీరును పావుగా వాడుకున్నారా?

పన్నీరును పావుగా వాడుకున్నారా?

కేంద్రం కల్పించిన కష్టాల నుండి గట్టెక్కేందుకు పన్నీర్‌సెల్వంను శశికళ వర్గం పావుగా వాడుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. తనను బహిష్కరిస్తే ప్రభుత్వాన్ని కూల్చివేసే ఎమ్మెల్యేల బలం ఉందని రెండురోజుల క్రితం హెచ్చరించిన దినకరన్‌ వేటుకు వంతపాడటం, శశికళ నోరు మెదపక పోవడం వెనుక అంతరార్థం ఈ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.

అన్నాడీఎంకేను దారిలోకి తెచ్చుకోవడమే మేలని

అన్నాడీఎంకేను దారిలోకి తెచ్చుకోవడమే మేలని

ఇదిలా ఉండగా బీజేపీ వ్యూహం మరోలా కనిపిస్తోందని అంటున్నారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే గెలుపు నల్లేరు మీద నడకకాగలదు.

కాంగ్రెస్‌ మిత్రపక్ష డీఎంకే అధికారంలోకి వచ్చేకంటే అస్తవ్యస్తంగా తయారైన అన్నాడీఎంకేను దారికి తెచ్చుకుని తనకు అనుకూలంగా మలుచుకోవడం మేలనే ఆలోచనతోనే తమిళనాడు ప్రభుత్వంపై బీజేపీ పలు కోణాల్లో ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది.

అన్నాడీఎంకే విలీన వ్యూహం వెనుక బీజేపీ ప్లాన్

అన్నాడీఎంకే విలీన వ్యూహం వెనుక బీజేపీ ప్లాన్

రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నాటికి అన్నాడీఎంకేను మిత్రపక్షంగా చేసుకుని తమిళనాడులో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమే వీలీనం వెనుక వ్యూహమని కొందరు భావిస్తున్నారు. రాష్ట్రపతి పాలన ప్రమాదం నుంచి గట్టేక్కేందుకు శశికళ వర్గం, తమిళనాడులో జెండా పాతేందుకు బీజేపీ.. విలీనానికి వ్యూహకర్తలు అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Changing guard of AIADMK: Is BJP influencing the party to get rid of Sasikala, Dinakaran?
Please Wait while comments are loading...