ఉంగరాలు, రత్నాలు అమ్మే ఓ బాబా రూ.100 కోట్లకు యజమాని!.. రంగంలోకి ఈడీ!

Changur Baba: ఉత్తరప్రదేశ్‌కు చెందిన జమాలుద్దీన్ అలియాస్ చాంగూర్ బాబా కొన్ని సంవత్సరాల క్రితం వరకు రోడ్లపై ఉంగరాలు, రత్నాలు అమ్ముకునేవాడు. ఇప్పుడు రూ.100 కోట్ల ఆస్తికి యజమానిగా తెలుస్తోంది. ఏటీఎస్ దర్యాప్తులో చాంగూర్ బాబా, అతని సంస్థలకు సంబంధించిన ఖాతాల్లో రూ.100కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు తేలింది.

చాంగూర్ బాబా ఈ చర్యలపై ఏటీఎస్ వివరణాత్మక నివేదికను రూపొందించి ఈడీకి ఇచ్చింది. ఇప్పుడు ఈ కేసులో మనీలాండరింగ్ చట్టం కింద దర్యాప్తు జరగనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అక్రమ మత మార్పిడి నెట్‌వర్క్‌ను నడుపుతున్న ఆరోపణలతో అరెస్టు చేసిన చాంగూర్ బాబా ఇతనే. కొన్నేళ్ల క్రితం ఉంగరాలు, రత్నాలు అమ్ముకునేవాడు. కేవలం ఐదారేళ్లలోనే ఒక విలాసవంతమైన భవనం, లగ్జరీ వాహనాలు, అనేక నకిలీ సంస్థలకు యజమాని అయ్యాడు. మధుపూర్ గ్రామంలోని కోఠి అతడి నెట్‌వర్క్ ప్రధాన స్థావరం. అక్కడి నుంచి చాంగూర్ బాబా మొత్తం నెట్‌వర్క్ పనిచేసేది.

Changur Baba From Ring Seller to Rs 100 Crore Empire ED Investigation Begins

14 మంది సహచరుల కోసం గాలింపు.. దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్
చాంగూర్ బాబా నెట్‌వర్క్‌కు చెందిన 14 మంది ప్రధాన సహచరుల కోసం ఏటీఎస్, ఎస్టీఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఇందులో అప్పటి జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. మహబూబ్, పింకీ హరిజన్, హాజిరా శంకర్, పైమాన్ రిజ్వీ, సగీర్ అనే ప్రధాన సహచరుల కోసం గాలిస్తున్నారు. వీరి అరెస్ట్‌తో ముఠా నెట్‌వర్క్ లోతైన రహస్యాలు బయటపడవచ్చు. ఈ ముఠాలోని పలువురు సభ్యులు అజమ్‌గఢ్, ఔరయ్యా, సిద్ధార్థనగర్ వంటి జిల్లాల నుంచి వచ్చారు. వారిపై గతంలోనే ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.

కళాశాల ప్రారంభించే ప్రణాళిక
మధుపూర్‌లో విలాసవంతమైన కోఠిని నిర్మించిన తర్వాత, చాంగూర్ బాబా అదే ప్రాంగణంలో డిగ్రీ కళాశాలను ప్రారంభించాలని యోచించాడు. ఇందుకోసం భవన నిర్మాణాన్ని కూడా ప్రారంభించాడు. ప్రస్తుతం అతని అరెస్టు, దర్యాప్తు కారణంగా అతని ప్రణాళికలు నిలిచిపోయాయి.

50 ఇస్లామిక్ దేశాల్లో ప్రయాణించిన చాంగూర్ బాబా
ఉత్తరప్రదేశ్ ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) అమితాబ్ యశ్ మాట్లాడుతూ.. జమాలుద్దీన్ బాబా ఇప్పటివరకు 40 నుంచి 50 సార్లు ఇస్లామిక్ దేశాలకు ప్రయాణించాడని తెలిపారు. దర్యాప్తులో అతను బలరాంపూర్‌లో అనేక ఆస్తులను కూడా కొనుగోలు చేసినట్లు తేలింది. అతనిపై కేసు కూడా నమోదు చేయబడింది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ నెట్‌వర్క్ భారతదేశం అంతటా విస్తరించి ఉందని ఎస్టీఎఫ్ తెలిపింది. విదేశీ నిధులు ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుండి వస్తున్నట్లు వెల్లడైంది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+