కేరళలో తొలి దళిత పూజారి: బాధ్యతలు స్వీకరించిన యేదు కృష్ణన్

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరువనంతపురం: కేరళలో తొలి దళిత పూజారిగా యేదు కృష్ణన్‌ అనే వ్యక్తి చరిత్ర సృష్టించారు. తిరువళ్లకు సమీపంలోని మణప్పురం శివాలయ అర్చకునిగా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ట్రావన్‌కోర్‌ దేవాలయ మండలి ఇటీవల 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా ఎంపిక చేసింది. వీరిలో ఆరుగురు దళితులు. శబరిమల అయ్యప్పస్వామి ఆలయం సహా 1248 దేవాలయాల ఈ మండలి పర్యవేక్షిస్తోంది.

Chanting mantras, breaking barriers: Kerala’s first Dalit priest takes charge

సంస్కృతంలో పీజీ విద్యను అభ్యసిస్తున్న యేదు కృష్ణన్‌ గత పదేళ్లుగా పూజాక్రతువులను నేర్చుకున్నారు. తన గురువు కేకే అనిరుద్ధన్‌ తంత్రి నుంచి ఆశీర్వాదం పొందాక కృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రధాన అర్చకులు గోపకుమార్‌ నంబూద్రి మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణన్‌ ఆలయ ప్రవేశం చేశారు

1936 నవంబరు 12న ట్రావన్‌కోర్‌ సంస్థానం నిమ్నకులాల వారికి ఆలయ ప్రవేశ అర్హతను కల్పిస్తూ శాసనం చేసింది. ఆ ప్రకటన వెలువడి 81 ఏళ్లు పూర్తికావస్తున్న సమయంలో దళిత వ్యక్తి పూజారిగా బాధ్యతలు స్వీకరించటం విశేషం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Yedu Krishnan scripted history on Monday by becoming the first Dalit priest in Kerala to assume duties at the sanctum sanctorum of the Manappuram Lord Shiva Temple at nearby Thiruvalla.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి