అవును.. చిన్న పొరపాటు జరిగింది: పంకజ ముండే
ముంబై: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పల్లీ చిక్కీ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే విధాన సభలో వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వార్తల ప్రకారం.. చిక్కీ కొనుగోళ్ల కాంట్రాక్టు విషయంలో చిన్న పొరపాటు జరిగిందని ఆమె అంగీకరించారని తెలుస్తోంది.
నిబంధనలను అతిక్రమించి కాంట్రాక్టులు అప్పగించడం పొరపాటేనని ఆమె విదాన సభ ప్రశ్నోత్తరాల సమయంలో లేఖ రూపంలో సమాధానమిచ్చారని తెలుస్తోంది. చిక్కీ కాంట్రాక్టులో కుంభకోణం జరిగిందనే ఆరోపణలు కొద్ది రోజులుగా వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

ఆమె అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో దానిపై రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా, చిక్కీ కుంభకోణం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పంకజ ముండే నుండి బాంబే హైకోర్టు వివరణ కోరింది.












Click it and Unblock the Notifications