వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Twitter ban: ఆ వార్తలపై నెటిజన్లు ఫైర్: బీజేపీ టార్గెట్: కూ ఉండగా..అదెందుకూ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టినట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియా హోదాను కోల్పోనుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించే రక్షణపరమైన చర్యలన్నింటినీ ట్విట్టర్ కోల్పోనుంది. కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూపొందించిన మార్గదర్శకాలు, విధివిధానాలకు లోబడి పనిచేయకపోవడం వల్లే ట్విట్టర్ యాజమాన్యానికి కేంద్రం ఈ షాక్ ఇచ్చింది. దీనిపై ట్విట్టర్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

దద్దరిల్లుతోన్న విశాఖ ఏజెన్సీ: కొయ్యూరులో భారీ ఎన్‌కౌంటర్: ఆరుమంది మావోయిస్టులు మృతిదద్దరిల్లుతోన్న విశాఖ ఏజెన్సీ: కొయ్యూరులో భారీ ఎన్‌కౌంటర్: ఆరుమంది మావోయిస్టులు మృతి

ట్విట్టర్‌ సేవలను దేశంలో నిషేధిస్తారంటూ వస్తోన్న ఈ వార్తలపై నెటిజన్లు భగ్గుమంటోన్నారు. తమ ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. కేంద్రప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. నెటిజన్ల స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు. మెమెలతో సెటైర్లు సంధిస్తోన్నారు. మరికొందరు యూజర్లు సానుకూలతనూ వ్యక్తం చేస్తోన్నారు. స్వేచ్ఛ పేరుతో తప్పుడు సమాచారాన్ని, వీడియోలను ప్రమోట్ చేయడం సరికాదని అంటున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. కూ ప్లాట్‌ఫామ్‌ను ప్రోత్సహించాల్సి ఉంటుందంటూ సూచిస్తోన్నారు.

 Check Out The Netizens Troll As Twitter Ban In India Hashtag Trends Worldwide

సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి అవుతోందనే కారణంతో భారతీయ జనతా పార్టీ నాయకులు కొందరు కేంద్రానికి ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. దీనికి అవసరమైన కొన్ని సాక్ష్యాధారాలను వారు అందజేసినట్లు ఐటీ మంత్రిత్వ శాఖ చెబుతోంది. థర్డ్ పార్టీ ద్వారా వాటిపై పరిశీలన జరిపించడంతో- అవి నిజమేనంటూ తేలడంతో కేంద్రం కొత్తగా ఈ మార్గదర్శకాలను రూపొందించింది. ఫేస్‌బుక్, వాట్సప్ వంటి ప్లాట్‌ఫామ్స్ వాటికి లోబడి పని చేస్తామని ప్రకటించాయి. ట్విట్టర్ కొంత గడువు కోరింది. ఈ గడువు పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించలేదు.

English summary
Netizens Troll As Twitter Ban In India Hashtag Trends Worldwide after the microblogging platform to lose its status as intermediary platform in India as it does not comply with new guidelines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X