విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెడ్డీ గ్యాంగ్: గుజరాత్ నుంచి వచ్చి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అర్థరాత్రి దొంగతనాలు - ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చెడ్డీ గ్యాంగ్

కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో చోరీలకు తెగబడుతోంది చెడ్డీ గ్యాంగ్ సభ్యులేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు 'సాక్షి' తెలిపింది.

''గుజరాత్ నుంచి వచ్చిన ఈ గ్యాంగ్ సభ్యులను పట్టుకునేందుకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఆధ్వర్యలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

ఇటీవల చిట్టినగర్, గుంటుపల్లి, పోరంకి, శివారు ప్రాంతాల్లో జరిగిన చోరీల్లో చెడ్డీ గ్యాంగ్ పాల్గొందని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో సైతం ఈ గ్యాంగే చోరీకి యత్నించిందని.... నాలుగు ఘటనల్లో నమోదైన సీసీ పుటేజీ ఆధారంగా నిందితుల ఆనవాళ్లు విశ్లేషించి, రెండు గ్యాంగ్‌లు పాల్గొన్నాయని పోలీసులు తేల్చారు.

  • చెడ్డీ గ్యాంగ్ సభ్యులు పగలు దుప్పట్లు, ఉన్ని దుస్తులు విక్రయించే వారిగా, ఖరీదైన ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పనులకు వెళ్లి రెక్కీ చేస్తున్నారు. మనుషులు లేని ఇళ్లను గుర్తిస్తున్నారు.
  • రాత్రి పూట చోరీలు చేస్తున్నారు. ప్రస్తుతం జరిగిన దొంగతనాలన్నీ అర్థరాత్రి ఒంటిగంట దాటాక, తెల్లవారుజామున నాలుగు గంటల్లోపే జరిగాయి.

చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడిన నాలుగు ఘటనా స్థలాలను సీపీ టి.కె. రాణా గురువారం స్వయంగా పరిశీలించారు.

''వరుస చోరీ ఘటనల్లో పాల్గొన్నది రెండు చెడ్డీ గ్యాంగులుగా భావిస్తున్నాం. గుజరాత్ నుంచి ఈ గ్యాంగులు వచ్చాయని తెలిసింది. అక్కడి ఎస్పీతో మాట్లాడగా దహోద్ ప్రాంతం నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చినట్లు నిర్ధారించారు. చోరులను పట్టుకునేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శివారు ప్రాంతాల్లో గస్తీ పెంచాం. సాయుధ బలగాల పహారా ఏర్పాటు చేశాం. త్వరలో గ్యాంగులను పట్టుకుంటాం'' అని టి. కె. రాణా చెప్పినట్లు సాక్షి కథనం తెలిపింది.

ఏపీ సీఎం, గవర్నర్

ఆసుపత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డిశ్చార్జ్

కోవిడ్ అనంతర సమస్యలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు పూర్తిగా కోలుకున్నారని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

''వారిద్దరినీ గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వీరి ఆరోగ్య పరిస్థితి తిరిగి సాధారణంగా మారిందని, కోవిడ్ అనంతర సమస్యలు ఏమీ లేవని, అయితే అన్‌లైన్‌లో వైద్యసేవలు కొనసాగుతాయని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి సిసోడియా హైదరాబాద్ వెళ్లి డిశ్చార్జ్‌కి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం గవర్నర్ దంపతులు గురువారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నట్లు'' ఆంధ్రజ్యోతి కథనంలో రాసుకొచ్చింది.

జంతువులు

40% పెరిగిన శాకాహార జంతువులు

రాష్ట్రంలో అటవీశాఖ అధికారులు చేపట్టిన గడ్డిమైదానాల పెంపకంతో రెండేండ్లలో కవ్వాల్‌, అమ్రాబాద్‌ టైగర్‌జోన్‌ పరిధిలో 40 శాతం శాకాహార జంతువులు పెరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నట్లు 'నమస్తే తెలంగాణ' తెలిపింది.

''దీంతో పులులకు సమృద్ధిగా ఆహారం అందుబాటులోకి వచ్చిందని భావిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 5 వేల హెక్టార్లలో గడ్డిమైదానాలు విస్తరించి ఉన్నాయి.

2018లో కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో 600 ఎకరాల్లో గడ్డి క్షేత్రాల పెంపకానికి అధికారులు శ్రీకారం చుట్టారు.

2019లో 130 హెక్లార్లలో, 2020లో 200 హెక్టార్లలో, 2021లో 140 హెక్టార్లలో గడ్డి మైదానాల పెంపకం చేపట్టారు.

ఇందుకోసం ఏడాదికి రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చుచేశారు. నాలుగేండ్లలో సుమారు రూ.35 కోట్లు ఖర్చు చేసినట్లు'' నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఏసీ బోగీల్లో 336 కిలోల గంజాయి

ముంబైకి గంజాయి సప్లయ్ చేస్తున్న 14 మందిని నాంపల్లి రైల్వే పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు 'వెలుగు' వెల్లడించింది.

''వారి దగ్గరి నుంచి రూ. 67 లక్షల విలువైన 336 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో ఏడుగురు మహిళలు, ఏడుగురు పురుషులు సహా మైనర్ ఒకరు ఉన్నారు.

విశాఖపట్నం అరుకువ్యాలీ పెద్దలబుడు గ్రామానికి చెందిన షెట్టి మహాదేవి (26) ముంబై డ్రగ్ మాఫియాతో చేతులు కలిపి, అక్కడికి గంజాయి సప్లయ్ చేస్తోంది.

తన గ్రామానికి చెందిన ఆరుగురు మహిళలు, ఏడుగురు మగవాళ్లకు క్రిస్మస్ ఖర్చులు ఇస్తానని చెప్పి, ఏజెన్సీ ఏరియాల నుంచి వారితో గంజాయి కలెక్ట్ చేయించింది.

336 కిలోల గంజాయిని 24 బ్యాగుల్లో ప్యాక్ చేయించి, 13 మందితో పాటు పిల్లలను తీసుకొని ముంబై బయలుదేరింది. వీరందరూ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా ముంబై వెళ్తున్న ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో మూడు బోగీల్లో మూడు టీమ్‌లుగా ఎక్కారు.

స్పెషల్ రైడ్స్‌లో భాగంగా బుధవారం రాత్రి నాంపల్లి పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో మహాదేవి సహామిగతా వాళ్లందరి బ్యాగులు చెక్ చేయగా గంజాయి దొరికింది.

పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు చిన్నారులతో పాటు ఏసీ బోగీల్లో ట్రావెల్ చేసినట్లు గుర్తించినట్లు'' వెలుగు వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Cheddi gang: Midnight thefts from Gujarat to Guntur and Krishna districts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X