బెంగళూరులో చుచ్చు పోయిస్తున్న చిరుత, నాతో పెట్టుకోకు, అపార్ట్ మెంట్ లో వాకింగ్ !
బెంగళూరు: బెంగుళూరులోని అనేకల్ ప్రాంతంలోని స్థానికుల్లో ఆందోళన సృష్టించిన చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అటవీ శాఖ సిబ్బందిపై చిరుత దాడి చేసింది. ఆనేకల్‌లోని కృష్ణారెడ్డి పారిశ్రామికవాడలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో చిరుత పులి దృశ్యాన్ని మొబైల్ ఫోన్‌లో బంధించారు. కుడ్లూ సమీపంలోని కృష్ణారెడ్డి లేఔట్ లో చిరుత కనిపించింది.
ఈ దృశ్యాన్ని స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి అటవీశాఖ అధికారులకు పంపించారు. కొద్ది రోజులుగా చిరుత రాత్రిపూట బయటకు వచ్చి స్థానికులకు నిద్రలేకుండా చేస్తోంది. దీంతో చిరుతను పట్టుకునేందుకు అధికారులు థర్మల్ డ్రోన్‌తో ఆపరేషన్ చేస్తుండగా చిరుత ముగ్గురిపై దాడి చేసింది. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది బృందంలో అనస్థీషియా నిపుణులు డాక్టర్ కిరణ్‌పై చిరుత దాడి చేయడంతో గాయాలు అయ్యాయి. డాక్టర్ కిరణ్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తరువాత షార్ప్ షూటర్‌పై చిరుత ఒక్కసారిగా దాడి చేసింది.

చిరుత దాడిలో అతను కూడా గాయపడ్డాడు. చిరుతను పట్టుకోవడంలో నిపుణుల బృందం రంగంలోకి దిగింది. అటవీ శాఖలోని మరో సిబ్బందిపై కూడా చిరుత దాడి చేసింది. షార్ప్ షూటర్ ఇంజెక్షన్ సూదితో చిరుతను కాల్చిన తరువాత అది స్పృహతప్పి పడిపోయింది. ఆ సందర్భంలో దాన్ని పట్టుకునేందుకు వెళ్లగా ఆ చిరుత దాడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మైదాన ప్రాంతాల్లో చిరుతపులిని పట్టుకోవడం కష్టం. చిరుతను పట్టుకునే వరకు ఒంటరిగా నడవవద్దని, అప్రమత్తంగా ఉండాలని అటవి శాఖ అధికారులు, పోలీసులు స్థానికులకు మనవి చేస్తున్నారు.
శిథిలావస్థకు చేరిన భవనం చుట్టూ చిరుత తిరుగుతున్నట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఆ స్థలంలో వెతకడం ప్రారంభించారు. చిరుతను పట్టుకునేందుకు ఎనిమిది మందితో కూడిన ప్రత్యేక బృందం మైసూరు నుంచి బెంగళూరుకు చేరుకుంది. హునసూరు వన్యప్రాణి విభాగం బృందంతో పాటు వైద్యులు, ఇతర అధికారులు చిరుతను పట్టుకునేందుకు అవసరమైన సామాగ్రితో గాలింపు ప్రారంభించారు. ఈ సమయంలో చిరుత ముగ్గురి మీద దాడి చెయ్యడంతో అందరూ హడలిపోయారు.

చిరుత పాడుపడిన బిల్డింగ్ సమీపంలో సంచరిస్తుండగా దాన్ని లక్ష్యంగా చేసుకుని మత్తు ఇంజక్షన్ తో కాల్చారు. మోతాదు తక్కువగా ఉండటంతో చిరుత స్పృహ కోల్పోకుండా బంధించిన వారిపై దాడి చేసింది. గత నెల 29వ తేదీ రాత్రి నుంచి ఆనేకల్‌లోని కూడ్లు గేటు దగ్గర కనిపించిన చిరుత మళ్లీ 30వ తేదీన ఓ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడింది. అపార్ట్ మెంట్ మొదటి అంతస్తు వరకు వెళ్లిన చిరుత ఆ ఫ్లోర్ లో చుట్టూ తిరిగి అక్కడ దర్జాగా కొంత సేపు ఉండిపోయింది.
కూడ్లు గేట్ సమీపంలోని సాలార్ పురిలోని సత్వా కాడెంజా అపార్ట్‌మెంట్‌లో కనిపించిన చిరుతపులి పార్కింగ్ స్థలం నుండి ప్రవేశించి మొదటి అంతస్తు వరకు వెళ్లి సంచరించింది. కూడ్లు సమీపంలోని ఐటీ టెక్ పార్క్ సమీపంలో సోమవారం రాత్రి కూడా చిరుతపులి కనిపించింది. ఆనేకల్‌లోని కృష్ణారెడ్డి ఇండస్ట్రియల్ ఏరియాలో శిథిలావస్థలో ఉన్న భవనంలో చిరుత చేరిందన్న సమాచారం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులసు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం నుంచి దాని కోసం గాలిస్తున్నారు. మైసూరు నుంచి చిరుతను బంధించడానికి నిపుణుల బృందం బెంగళూరుకు వచ్చింది. మంగళవారం సాయంత్రం కాసేపు చిరుత కోసం గాలించిన అటవీ శాఖ సిబ్బంది నవంబర్ 1వ తేదీన పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications