ఎన్నికల వేళ.. మంత్రి పొంగులేటికి బిగ్ షాక్
Ponguleti Srinivasa Reddy: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. మే 13వ తేదీన నాలుగో విడతలో రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవడానికి అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాయి.
ఈ పరిణామాల మధ్య తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్న ఆయనకు బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు పొంగులేటి హర్షా రెడ్డికి సమన్లు, నోటీసులు అందాయి.

చెన్నై కస్టమ్స్ విభాగం అధికారులు హర్షారెడ్డికి ఈ సమన్లను జారీ చేశారు. స్మగ్లింగ్ వ్యవహారమే దీనికి కారణం. కోట్లాది రూపాయల విలువ చేసే అత్యాధునిక గడియారాల స్మగ్లింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు పొంగులేటి హర్ష రెడ్డి. సరైన డాక్యుమెంట్స్ లేకుండా వాటిని దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి- ఈ నెల 4వ తేదీ నాడు విచారణకు హాజరుకావాలంటూ హర్షారెడ్డిని ఆదేశించారు కస్టమ్స్ అధికారులు. తాను డెంగ్యూ జ్వరం బారిన పడ్డానంటూ ఒక్కరోజు ముందు అంటే ఈ నెల 3వ తేదీన వారికి లేఖ రాశారు. జ్వరం నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు. ఈ నెల 27వ తేదీ తరువాత విచారణకు హాజరు కావడానికి అంగీకరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
హాంకాంగ్‌కు చెందిన ప్రవాస భారతీయుడు మహ్మద్ ఫహీరుద్దీన్ ముబీన్ నుంచి రెండు లగ్జరీ వాచీలు-పాటెక్ ఫిలిప్ 5740, బ్రెగ్యుట్ 2759 స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీన కస్టమ్స్ అధికారులు అతనిపై స్మగ్లింగ్ కేసును బుక్ చేశారు. ఆ వాచీల విలువ 1.73 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.
ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన నవీన్ కుమార్‌ను కూడా కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా.. ఈ రెండు వాచీలను కూడా పొంగులేటి హర్షా రెడ్డి కోసం అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చినట్లు తేలింది. ఈ రెండు వాచీలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని హవాలా రూపంలో చెల్లింపులు జరిపినట్లు కస్టమ్స్ అధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications