హైకోర్టులో స్టాలిన్ కు భారీ ఎదురు దెబ్బ: తమిళనాడు సీఎం బలపరీక్షకు నో !

తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ కు మద్రాసు హైకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ఎమ్మెల్యేల మద్దతు లేదని,

చెన్నై: తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ కు మద్రాసు హైకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ఎమ్మెల్యేల మద్దతు లేదని, ఆయన బలపరీక్షకు మరో సారి సిద్దం కావాలని డీఎంకే పార్టీ పోరాటం చేస్తోంది.

శాసన సభలో జులై 11వ తేదీన సీఎం ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం బలపరీక్ష నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని మనవి చేస్తూ డీఎంకే పార్టీ మద్రాసు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గురువారం డీఎంకే సమర్పించిన పిటిషన్ విచారణకు వచ్చింది.

Chennai HC rejects MK Stalin's plea on koovathur horse trading today.

డీఎంకే సమర్పించిన పిటిషన్ విచారణ చేసిన ధర్మాసనం ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం బలపరీక్ష నిర్వహించడానికి నిరాకరించింది. తమిళనాడు ప్రభుత్వం బలపరీక్ష నిర్వహించుకునే అవసరం లేదని, పళనిసామికి ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉందని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టులో వాదించారు.

వాదనలు విన్న న్యాయస్థానం జులై 11వ తేదీన ఎడప్పాడి పళనిసామి తన మెజరిటీ నిరూపించుకోవడానికి బలపరీక్ష నిర్వహించుకునే అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. కువత్తూరు రిసార్టులో ఎమ్మెల్యేలు నిర్బంధించి డబ్బులు ఎర వేసిన తరువాత సీఎంగా పళనిసామి బలపరీక్షలో నెగ్గారని, ఇప్పుడు మళ్లీ బలపరీక్ష నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని డీఎంకే పార్టీ మద్రాసు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+