జయలలిత వేలిముద్రలు: ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు, చిక్కుల్లో !
జయలలిత ప్రాణాలతో ఉంటే వేలి ముద్రలు ఎలా తీసుకున్నారుఎన్నికల కమిషన్ ను ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు, సమాధానం ఇవ్వండిఅపోలో ఆసుపత్రిలో బీఫాంలో జయలలిత వేలి ముద్రలు వేయించారు, హై కోర్టు జోక్యంతో ?
చెన్నై: ఉప ఎన్నికల సందర్బంగా ఎన్నికల కమిషన్ కు అన్నాడీఎంకే పార్టీ బీఫాంలు సమర్పించే సమయంలో జయలలిత వేలిముద్రలు వేసిన విషయంలో మద్రాసు హైకోర్టు విచారణ మొదలు పెట్టింది. జయలలిత ప్రాణాలతో ఉన్న సమయంలో ఆమెతో సంతకం చేయించుకోవాలని, ఎందుకు వేలి ముద్రలు వేయించారని హైకోర్టు ప్రశ్నించింది.
బీఫాంలో జయలలిత వేలిముద్రలు వేశారని మీరు ఎలా నమ్మారు, ఆ బీఫాంలు ఎలా తీసుకున్నారు అంటూ సమాధానం ఇవ్వాలని మద్రాసు హైకోర్టు బుధవారం ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రటరీకి సూచించింది. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో భీఫాంలో వేలిముద్రలు వేయించారు.

తమిళనాడులోని రెండు శాసన సభ నియోజక వర్గాలు, పుదుచ్చేరిలోని ఒక శాసన సభ నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నిల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాదర్శి జయలలిత బీఫాంలో వేసిన వేలిముద్రలు ఉన్న పత్రాలు ఎన్నికల కమిషన్ కు సమర్పించారు.
జయలలిత బీఫాంలో వేలి ముద్రలు వేసే సమయంలో తమిళనాడు ప్రభుత్వ వైద్యుడు సాక్షిగా ఉన్నారు. ఆ సందర్బంలో ఈ జయలలిత వేలిముద్రలు ఉన్న బీఫాంలు స్వీకరించిన ఎన్నికల కమిషన్ అధికారులు అన్నాడీఎంకే పార్టీ నుంచి ముగ్గురు ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం ఇచ్చారు. ఈ విషయంపై మద్రాసు హైకోర్టు వివరణ కోరడంతో సమాధానం ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ అధికారులు సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications