చెన్నై పోలీసు కమిషనర్ ను బదిలి చెయ్యాలి: డీఎంకే ఎంపీల డిమాండ్

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో అధికారంలో అన్నాడీఎంకే పార్టీ అరచకాలు చేసే అవకాశం ఉందని, వారి ఆటలు సాగకుండా ఉండాలంటే వెంటనే చెన్నై నగర పోలీసు కమిషన్ జార్జ్ ను వేరే ప్రాంతానికి బదిలీ చెయ్యాలని ప్రతిపక్ష పార్టీ డీఎంకే ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.

శశికళకే ఝలక్: చెప్పకుండానే దినకరన్ పోటీనా, మండిపడిన చిన్నమ్మ!

గురువారం ఢిల్లీలో డీఎంకే పార్టీ ఎంపీలు ఎన్నికల చీఫ్ నజీమ్ జిద్దీని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం డీఎంకే పార్టీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ చెన్నై నగరంలోని ఆర్ కే నగర్ నియోజక వర్గంలో త్వరలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.

Chennai Police Commissioner George to be transferred to some other place, demands DMK MPs to Nazeem Zaidi.

ఉప ఎన్నికల్లో చెన్నై నగర పోలీసు కమిషనర్ అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ సహకరించే అవకాశం ఉందని డీఎంకే పార్టీ ఎంపీలు అనుమానం వ్యక్తం చేశారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే చెన్నై నగర పోలీసు కమిషనర్ జార్జ్ ను వెంటనే వేరే ప్రాంతానికి బదిలి చెయ్యాలని ఎన్నికల కమిషన్ అధికారి నజీమ్ జిద్దీకి మనవి చేశామని అన్నారు.

బడ్జెట్ సమావేశంలో శశికళ ఆశయాల కోసం అంటూ పరువు తీశారు!

ఎన్నికలు పూర్తి అయ్యే వరకు చెన్నై నగర పోలీసు కమిషనర్ జార్జ్ ను వేరే ప్రాంతానికి బదిలి చెయ్యాలని అన్నారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు పూర్తి అయిన తరువాత మళ్లీ చెన్నై నగర పోలీసు కమిషనర్ గా జార్జ్ ను నియమిస్తే మాకు ఎలాంటి అభ్యతంతరం లేదని డీఎంకే పార్టీ ఎంపీలు అన్నారు. చెన్నై నగర పోలీసు కమిషనర్ ను బదిలి చెయ్యాలని పలు పార్టీల నాయకులు ఇప్పటికే డిమాండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chennai Police Commissioner George to be transferred to some other place till RK Nagar byelection ends, demands DMK MPs to Nazeem Zaidi.
Please Wait while comments are loading...