Ex Wife: సెల్ ఫోన్ షోరూమ్ లో భార్య, నేరుగా వెళ్లి యాసిడ్ పోసిన భర్త, ఆ విషయంలో విడాకులు !
చెన్నై: పెళ్లి చేసుకుని కాపురం చేసిన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 15 సంవత్సరాలు కాపురం చేసిన దంపతుల మద్య ఓ విషయంలో గొడవలు మొదలైనాయి. భార్య కుటుంబ సభ్యులు అదే సిటీలో ఉంటున్నారు. పదేపదే భార్య కుటుంబ సభ్యులు వెళ్లి పంచాయితీలు చేశారు. భార్య తీరుతో భర్తకు అనుమానం ఎక్కువ అయ్యింది. ఇంతకాలం కాపురం చేశాము, ఇక ఎందుకులే అనుకున్నారో ఏమో ఇద్దరూ విడాకులు తీసుకుని వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. భార్య సొంతంగా మొబైల్ షోరూమ్ పెట్టుకుని డబ్బులు బాగా సంపాధిస్తోంది. మొబైల్ షోరూమ్ చాలా మంది వెలుతున్నారు. ఇదే సమయంలో తన మాజీ భార్య మీద ఆమె భర్త మీద రగిలిపోయాడు. నేరుగా మొబైల్ షారూమ్ లోకి వెళ్లిన భర్త నాతో కలిసి కాపురం చేస్తావా ? చస్తావా ? అని అడిగాడు. మొబైల్ షోరూమ్ లో మాజీ దంపతుల మద్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో మాజీ భర్త జోబులో ఉన్న యాసిడ్ బాటిల్ తీసుకుని మొబైల్ షోరూమ్ లోనే అతని మాజీ భార్య మీద పోసేసి అక్కడి నుంచి సినిమా హాల్ నుంచి బయటకు వెళ్లినట్లు దర్జాగా వెళ్లిపోయాడు. మొబైల్ షోరూమ్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమోరాల్లో రికార్డు కావడం, ఆ యాసిడ్ దాడి క్లిప్పింగ్స్ బయటకు రావడంతో వరైల్ అయ్యాయి.

15 ఏళ్ల క్రితం పెళ్లి
చెన్నై సిటీలోని తండయార్ పేట్ లోని నేతాజీ నగర్ రెండో వీధిలో ఓం మురుగన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 15 సంవత్సరాల క్రితం చెన్నైలోని శాస్త్రీ నగర్ లో నివాసం ఉంటున్న తమిళరసి అనే మహిళతో ఓం ప్రకాష్ వివాహం జగిరింది. పెళ్లి చేసుకుని కాపురం చేసిన ఓం మురుగన్, తమిళరసి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

భర్త పెయింటర్
పెయింటింగ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్న ఓం ప్రకాష్ డబ్బులు బాగానే సంపాదిస్తూ భార్య, పిల్లలను బాగానే చూసుకునేవాడు. ఐదు సంవత్సరాల నుంచి ఓం మురుగన్, తమిళరసి దంపతుల మద్య సమస్యలు మొదలైనాయి. కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన ఓం మురుగన్, తమిళరసి దంపతుల మద్య ఓ విషయంలో గొడవలు పెద్దవి అయ్యాయియి.

బస్సు చార్జీ లేకుండా పంచాయితీలకు వచ్చేస్తున్న భార్య ఫ్యామిలీ
భార్య తమిళరసి కుటుంబ సభ్యులు చెన్నై సిటీలో ఉంటున్నారు. పదేపదే భార్య తమిళరసి కుటుంబ సభ్యులు బస్సు చార్జీలు లేవని అనుకున్నారో ? ఏమో ? పదేపదే వెళ్లి దంపతుల మద్య పంచాయితీలు చేశారు. తమిళరసి కుటుంబ సభ్యులు పదేపదే వచ్చి పంచాయితీలు చెయ్యడంతో ఓం మురుగన్ రగిలిపోయాడు.

విడాకులు తీసుకున్న దంపతులు
పెద్దల పంచాయితీలు విఫలం కావడంతో మూడు సంవత్సరాల క్రితం ఓంమురుగన్, తమిళరసి దంపతులు విడాకులు తీసుకున్నారు. తమిళరసి ఇద్దరు పిల్లలతో కలిసి శాస్త్రీనగర్ లోని పుట్టింటిలో నివాసం ఉంటున్నది. భర్తకు దూరం అయిన తమిళరసి ఇద్దరు పిల్లలను పోషించడానికి వ్యాపారం చెయ్యాలని డిసైడ్ అయ్యింది.

సెల్ ఫోన్ షోరూమ్ పెట్టిన భార్య
చెన్నైలోని పుట్టవన్నరపేట్ లో తమిళరసి సెల్ ఫోన్ షోరూమ్ ప్రారంభించింది. తమిళరసి సొంతంగా సెల్ ఫోన్ షోరూమ్ పెట్టుకుని డబ్బులు బాగా సంపాధిస్తోంది. సెల్ ఫోన్ షోరూమ్ కు చాలా మంది మగాళ్లు వెలుతున్నారు. ఇదే సమయంలో మాజీ భార్య తమిళరసి మీద ఆమె భర్త ఓంమురుగన్ కు అనుమానం పెరిగిపోయి ఆమె మీద రగిలిపోయాడు.

నాతో వచ్చి కాపురం చేస్తావా ? చస్తావా
నేరుగా సెల్ ఫోన్ షారూమ్ లోకి వెళ్లిన ఓంమురుగన్ నాతో కలిసి కాపురం చెయ్యాలని అతని మాజీ భార్య తమిళరసికి చెప్పాడు. నీతో విడాకులు తీసుకున్నాను, ఇక ముందు నీ ముఖం కూడా చూడనని తమిళరసి తేల్చి చెప్పింది. నాతో వచ్చి కాపురం చేస్తావా ? లేదా చస్తావా ? అని ఓంమురుగన్ అతని మాజీ భార్య తమిళరసిని అడిగాడు. సెల్ ఫోన్ షోరూమ్ లో మాజీ దంపతులు ఓంమురుగన్, తమిళరసిల మద్య వాగ్వివాదం జరిగిం

షోరూమ్ లో భార్య మీద యాసిడ్ పోసిన భర్త
ఆ సమయంలో మాజీ భర్త ఒంమురుగన్ అతని జోబులో ఉన్న యాసిడ్ బాటిల్ తీసుకుని సెల్ ఫోన్ షోరూమ్ లో కుర్చుని ఉన్న అతని మాజీ భార్య తమిళరసి మీద పోసేసి అక్కడి నుంచి సినిమా హాల్ నుంచి బయటకు వెళ్లినట్లు దర్జాగా వెళ్లిపోయాడు. తమిళరసికి తీవ్రగాయాలు కావడంతో ఆమెను చెన్నైలోని స్టాల్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బంధువుల ఇంట్లో తలదాచుకున్న ఓంమురుగన్ ను అరెస్టు చేశారు. మొబైల్ షోరూమ్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమోరాల్లో రికార్డు కావడం, ఆ యాసిడ్ దాడి క్లిప్పింగ్స్ బయటకు రావడంతో వరైల్ అయ్యాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications