వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నై సిల్క్స్ లో 400 కేజీల బంగారంతో సహ రూ. 20 కోట్ల వజ్రాలు ఎక్కడ ? 450 మందితో !

దిచెన్నై సిల్క్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం వలన దాదాపు రూ. 300 కోట్లు నష్టం జరిగిందని యాజమాన్యం పోలీసులకు చెప్పింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: చెన్నై నగరంలోని టీ నగర్ లోని ఉస్మాన్ రోడ్డులోని ది చెన్నై సిల్క్స్ ఏడంతస్తుల భవనంలోని 400 కేజీల బంగారంతో సహ రూ. 20 కోట్ల విలువైన వజ్రాల కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. దిచెన్నై సిల్క్స్ కు చెందిన ఏడు అంతస్తుల భవనం అగ్నికి ఆహుతి కావడంతో చెన్నై వాసులను కలచివేసింది.

అగ్నికీలల్లో అట్టుడికి పోయిన ది చెన్నై సిల్క్స్ భవనం ఎంతో ప్రమాదకరమని గుర్తించిన ప్రభుత్వం ఆ భవనం కూల్చి వెయ్యాలని నిర్ణయించింది. వివిధ శాఖలకు చెందిన అధికారులు ఇప్పటికే టీ నగర్ లోని చెన్నై సిల్క్స్ భవనం పరిశీలించారు.

ఇతర రాష్ట్రాల నిపుణులు !

ఇతర రాష్ట్రాల నిపుణులు !

భవనం కూల్చివేతకు ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను రప్పించి శుక్రవారం పనులు మొదలు పెట్టారు. అయితే భవనం ఆరవ అంతస్తు నుంచి మళ్లీ మంటలు ఎగసిపడటంతో భవనం కూల్చివేత పనులు తాత్కాలికంగా నిలిపివేశారు.

నియమాలు ఉల్లంఘించి ఏడు అంతస్తులు !

నియమాలు ఉల్లంఘించి ఏడు అంతస్తులు !

టీ నగర్ లో ది చెన్నై సిల్క్స్ భవన నియమాలు ఉల్లంఘించి నిర్మించారని విచారణలో వెలుగు చూసింది. కొందరు అధికారుల సహకరించడం వలనే ఎలాంటి అనుమతులు లేకుండా ఏడు అంతస్లు భవనం నిర్మించారని కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం గుర్తించింది.

కోర్టు అనుమతితో మళ్లీ !

కోర్టు అనుమతితో మళ్లీ !

టీనగర్ లోని ది చెన్నై సిల్క్స్ భవనం కూల్చి వెయ్యాలని 2006లో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయస్థానం అనుమతితో మళ్లీ తన షోరూంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అధికారులు అంటున్నారు.

మూడు రోజులు అయినా !

మూడు రోజులు అయినా !

బుధవారం వేకువ జామున ది చెన్నై సిల్క్స్ ఏడు అంతస్లుల భవనంలో మంటలు వ్యాపించాయి. అప్పటి నుంచి మంటలు అదుపు చెయ్యడానికి 450 మంది అగ్నిమాపక సిబ్బంది శక్తి వంచనలేకుండా పని చేశారు. 120 అగ్నిమాపక వాహనాలతో పాటు 54 ప్రైవేటు నీటీ ట్యాంకర్లతో మంటలు అదుపు చేశారు

కూల్చి వెయ్యాలి !

కూల్చి వెయ్యాలి !

ది చెన్నై సిల్క్స్ భవనం కూల్చి వెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం భవనం కూల్చి వేస్తున్న సమయంలో ఆరవ అంతస్లులో మళ్లీ మంటలు వ్యాపించడంతో కూల్చివేత పనులు తాత్కాలికంగా నిలిపివేశారు.

బంగారు, వజ్రాలు ఎక్కడ ?

బంగారు, వజ్రాలు ఎక్కడ ?

ది చెన్నై సిల్క్స్ ఏడు అంతస్తుల భవనంలోని 400 కేజీల బంగారు నగలతో సహ రూ. 20 కోట్ల విలువైన వజ్రాలు, రెండు వేల కేజీల వెండి వస్తులు ఉన్నాయని యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. వజ్రాలు, బంగారు నగలు సేఫ్టీ లాకర్ లో ఉన్నాయని చెప్పారు. అయితే 150 డిగ్రీల వేడి కారణంగా ఆ లాకర్ ఎక్కడ ఉందో గుర్తించలేక అగ్నిమాపక శాఖ అధికారులు అవస్థలు పడుతున్నారు.

రూ. 300 కోట్లు నష్టం !

రూ. 300 కోట్లు నష్టం !

దిచెన్నై సిల్క్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం వలన దాదాపు రూ. 300 కోట్లు నష్టం జరిగిందని యాజమాన్యం పోలీసులకు చెప్పింది. అందులో రూ. 80 కోట్ల విలువైన వస్త్రాలు ఉన్నాయి. బంగారు నగలు, వజ్రాల కోసం గాలిస్తున్నారు. 3,500 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించిన యాజమాన్యం వారిని వేరే శాఖల్లో విధుల్లో చేరాలని అక్కడి నుంచి పంపించేశారు.

English summary
Owners of the establishment claimed that gold approximately 400 kgs in weight and diamonds worth Rs 20 crore was put away inside a vault and are hoping that the fire has not destroyed it as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X