18 ఏళ్ల అమ్మాయి.. యువకుడి వేషం వేసింది.. ఆపైన ఏం చేసిందంటే..

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై : ఓ అమ్మాయి(18) అబ్బాయిలా వేషం మార్చుకొని... ఇద్దరు మైనరు బాలురతో కలిసి చోరీలకు పాల్పడిన ఉదంతం చెన్నై నగరంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై నగరం పరిధిలోని కొండితోపే ప్రాంత బేతనాయకన్ వీధిలో మణివణ్ణన్(60) అనే వ్యాపారి ఇంట్లో బుధవారం రాత్రి అలికిడైంది. రెండో అంతస్తులో పడుకున్న మణివణ్ణన్ ఆ అలికిడికి నిద్ర లేచాడు.

కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అలికిడి వస్తుండడం గమనించి మెల్లగా కిందికి దిగి వచ్చాడు. అదే సమయంలో ఓ బాలుడు బ్యాగుతో పరారవడం చూసి మణివణ్ణన్ అలారం మోగించాడు.

Chennai: Teenage girl dresses up like man to burgle houses, held

ఆ శబ్దానికి పోగైన స్థానికులు ఆ బాలుడ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలుడిని ప్రశ్నించగా 18 ఏళ్ల అమ్మాయి దొంగల ముఠా బాగోతం వెలుగుచూసింది. దయాళన్ అనే అమ్మాయి.. అబ్బాయి వేషం వేసుకొని అంబత్తూరు ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు బాలురితో ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడటం చూసి పోలీసులే అవాక్కయ్యారు.

ఆ అమ్మాయి ఇద్దరు బాలురతో కలిసి ముఠాను ఏర్పాటు చేసి ల్యాప్‌టాప్‌లు, ఐ ఫోన్లను చోరీ చేస్తున్నట్లు తేలింది. పోలీసులు గురువారం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి ల్యాప్‌టాప్‌లు, ఐ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ న్యాయవాది ఇంట్లోనూ వీరు చోరీ చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police on Thursday arrested three persons including an 18-year-old girl who dressed up as a man while indulging in burglaries. Police recovered I-phones and laptops and other valuables from them. The woman identified herself as Dayalan and made friends with two minor boys from Ambattur. They were caught red handed when they tried to escape after stealing from a house, police said. On Wednesday night, two of the minor boys walked into a house in Bethanayakan street in Kondithope.
Please Wait while comments are loading...