విశాల్ రాజీనామా చెయ్యాలి: వదిలి పెట్టం, పదవులు అడ్డం పెట్టుకుని రాజకీయాలు?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్ రాజకీయ రంగప్రవేశంపై అప్పుడే వివాదం మొదలైయ్యింది. ఆయన నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉంటే నిర్మాతలు అందరూ రోడ్డునపడాల్సి వస్తోందని విశాల్ వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది.

నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి విశాల్‌ వెంటనే రాజీనామా చేయ్యాలని డిమండ్‌ చేస్తూ ప్రముఖ నటుడు, దర్శకుడు చేరన్‌ తమిళ నిర్మాతల మండలికి లేఖ రాశారు. ఆర్ కే నగర్ శాసన సభ ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా హీరో విశాల్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఆర్ కే నగర్ లో విశాల్ పోటీ!

ఆర్ కే నగర్ లో విశాల్ పోటీ!

సోమవారం ఆర్ కే నగర్ శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి విశాల్ నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న హీరో విశాల్‌ మీద ఆరోపణలు గుప్పించడానికి ఆయన వ్యతిరేక వర్గం సిద్ధమైంది.

వదిలిపెట్టం అంటున్న చేరన్!

వదిలిపెట్టం అంటున్న చేరన్!

తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి విశాల్ వెంటనే రాజీనామా చేయ్యాలని ప్రముఖ నటుడు, దర్శకుడు చేరన్ డిమాండ్ చేశారు. విశాల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ చేరన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

 నాడు కరుణానిధి!

నాడు కరుణానిధి!

దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే హీరో విశాల్ డీఎంకే పార్టీ చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న విషయాన్ని నటుడు చేరన్ గుర్తు చేశారు.

 నేడు ఎంజీఆర్, జయలలిత!

నేడు ఎంజీఆర్, జయలలిత!

హీరో విశాల్‌ ఇప్పుడు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, అమ్మ జయలలిత సమాధులకు నివాళులు అర్పించి ఆర్ కే నగర్ లో ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి నామినేషన్‌ దాఖలు చేయడంలో అర్ధం ఏమిటి అని బహిరంగంగా చెప్పాలని చేరన్ డిమాండ్ చేశారు.

 నడి రోడ్డులో నిర్మాతలు?

నడి రోడ్డులో నిర్మాతలు?

హీరో, నిర్మాత విశాల్‌ తీసుకుంటున్న చర్యలకు నడిరోడ్డున పడేది తమిళ సినీ నిర్మాతలేనని చేరన్ ఆరోపించారు. ఇకపై నిర్మాతలకు ఏ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల నుంచి సహాయం అందదని చేరన్ ఆరోపించారు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్‌ నిర్మాతలకు ఎలాంటి మేలు చెయ్యలేదని చేరన్ విమర్శించారు.

పదవులు అడ్డంపెట్టుకుని!

పదవులు అడ్డంపెట్టుకుని!

నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, నిర్మాతల మండలి అధ్యక్ష పదువులు అడ్డం పెట్టుకుని విశాల్ రాజకీయంగా లబ్దీపొందడానికి ప్రయత్నిస్తున్నారని, ఆయన వెంటనే రాజీనామా చెయ్యాలని చేరన్ డిమాండ్ చేశారు. విశాల్ మీద పోరాటం ఇంతటిలో ఆగదని చేరన్ హెచ్చరించారు.

 నిర్మాతల మంచి కోరితే!

నిర్మాతల మంచి కోరితే!

విశాల్ కు నిజంగా నిర్మాతల మంచి కోరినట్లు అయితే వెంటనే నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి రాజీనామా చేయ్యాలని చేరన్ డిమాండ్‌ చేశారు. విశాల్ రాజీనామా చెయ్యకుండా ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే నిర్మాతలు అందరూ కలిసి ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చేరన్ హెచ్చరించారు.

 వ్యతిరేక వర్గం

వ్యతిరేక వర్గం

చెన్నైలోని అన్నాసలై ప్రాంతంలోని నిర్మాతల మండలి కార్యాలయంలో చేరన్, పలువురు తమిళ సినీ నిర్మాతలు సమావేశం అయ్యి విశాల్ కు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలని చర్చలు మొదలు పెట్టారు. విశాల్ రాజీనామా చేసే వరకూ వదలి పెట్టకూడదని, ఇది తమిళ సినీ నిర్మాతల అందరి సమస్య అని చేరన్ అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Director Cheran and some other Tamil Nadu film producers conducting sit in agitation inside producers ccouncil office at Chennai annasalai seeking resignation Vishal as Producer council president.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X