బాణసంచా లేకుండా దీపావళా? చేతన్‌భగత్‌ ట్వీట్‌.. ఆగ్రహించిన నెటిజన్లు

Posted By:
Subscribe to Oneindia Telugu
  Chetan Bhagat Trolled For Tweets over Diwali Firecrackers బాణసంచా లేకుండా దీపావళా?| Oneindia Telugu

  ఢిల్లీ: వాతావరణ కాలుష్యం దృష్ట్యా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో బాణసంచాపై సుప్రీంకోర్టు నిషేధాన్ని పునరుద్ధరించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 31 వరకు ఈ ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలపై నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది.

  అయితే సుప్రీం తీర్పుపై ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లతో విమర్శించారు. దీంతో బాణసంచాకు మద్దతిస్తున్న చేతన్‌ భగత్‌పై నెటిజన్లు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.

  సుప్రీం తీర్పుపై స్పందించిన చేతన్‌ భగత్‌.. ''నిషేధమా..? టపాసులు లేకుండా చిన్నారులకు దీపావళి ఏముంటుంది?'' అని ట్వీట్‌ చేశారు. అంతటితో ఊరుకోకుండా మరో ట్వీట్‌ చేశారు.

  Chetan Bhagat’s tweets on SC’s cracker ban get Twitterati talking, including Shashi Tharoor

  అందులో 'ఒక్క హిందూ పండగలకే ఇలాంటి నిర్ణయం తీసుకునే ధైర్యం ఉంటుందా? మేకలను వధించడం, మొహర్రంకు బ్లేడ్లతో కోసుకోవడం కూడా త్వరగా నిషేధించండి. దీపావళికి బాణసంచాను నిషేధించడం అంటే.. క్రిస్మస్‌ రోజున క్రిస్మస్‌ చెట్లను, బక్రీద్‌ రోజున మేకల వధను నిషేధించడం లాంటిదే. ఇలా చేయకండి.. సంప్రదాయాలను గౌరవించండి..'' అని పేర్కొన్నారు.

  చేతన్‌ భగత్‌ ట్వీట్లపై ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. మీ పిల్లలను చూస్తూ చూస్తూ కాలుష్యంలో నెట్టేయాలనుకుంటున్నారా? అని పలువురు నెటిజన్లు ఆగ్రహించారు.

  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ కూడా చేతన్ భగత్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ''మీరు చూపించిన ఉదాహరణలు సరిగా లేవు. దీపావళికి దీపాలను నిషేధిస్తే మీరు అలా మాట్లాడాలి. అంతేగానీ టపాసులు కాల్చడం సంప్రదాయం కాదు..'' అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Supreme Court’s ban on the sale of firecrackers in Delhi and NCR dampened the spirits of many enthusiasts who were looking forward to celebrating a cracking Diwali. Headed by Justice AK Sikri, a three-judge bench of the apex court upheld the November 11, 2016, order that suspended all licences permitting “sale of fireworks wholesale and retail within the territory of NCR”. A quick look through the Internet will show how many people, including Chetan Bhagat were not exactly pleased with the SC’s decision. The best-selling author, who has an active social media presence, took to Twitter to share his opinion about the ban and raised some pertinent questions.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి