కోబ్రా జవాన్ రాకేశ్వర్ సేఫ్, ఇదిగో ఫోటో -మావోయిస్టుల అనూహ్య ఎత్తుగడలు -అడవిలోకెళ్లిన మధ్యవర్తులు
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో నిత్యం భద్రతా బలగాలతో తలపడే మావోయిస్టులు ఈసారి అనూహ్య ఎత్తుగడలను అవలంబిస్తున్నారు. ఈనెల 3న బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దులోని టెర్రాం అటవీ ప్రాంతంలో వ్యూహాత్మకంగా దాడి చేసి 24 మంది జవాన్లను చంపేసిన నక్సల్స్.. ఒక జవాన్ ను బందీగా తీసుకెళ్లాను. అనంతరం అతని విడుదలకు సిద్ధమంటూ ఓ సుదీర్ఘ లేఖను విడుదల చేయడం, అందులో కేంద్ర, రాష్ట్రాలపై ఆరోపణలు గుప్పించడం, ఎన్ కౌంటర్ తాలూకు డ్రోన్ వీడియోను సైతం విడుదల చేశారు. తాజాగా తమ చెరలో ఉన్న కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ఫొటోను కూడా మావోయిస్టులు విడుదల చేశారు..
Recommended Video


జవాన్ రాకేశ్వర్ సేఫ్..
తమ చెరలో ఉన్న సీఆర్పీఎఫ్ కోబ్రా విభాగానికి చెందిన జవాన్ రాకేశ్వర్‌సింగ్ క్షేమంగా ఉన్నాడని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. అంతేకాదు క్షేమంగా ఉన్న జవాన్ ఫొటోను కూడా బుధవారం విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భీకర కాల్పుల తర్వాత కోబ్రా యూనిట్‌కు చెందిన రాకేశ్వర్‌సింగ్ అనే జవాన్ కనిపించకుండా పోయారు. అయితే ఆ జవాన్ తమ అదుపులో ఉన్నారని మావోయిస్టులు లేఖ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. రాకేశ్వ సింగ్ విడుదల కోసం ఆయన కుటుంబీకులు కేంద్రం పెద్దలకు వినతులు చేస్తుండటం తెలిసిందే. తాటాకులతో నిర్మించిన తాత్కాలిక శిబిరంలో జవాన్ రాకేశ్వర్ వేరొకరితో మాట్లాడుతుండగా అతనికి తెలియకుండా తీసినట్లున్న ఫొటోను మావోయిస్టులు విడుదల చేశారు.

వ్యూహాత్మకంగా అడుగులు..
24 మంది జవాన్ల మరణాలకు తాము కూడా చింతిస్తున్నామని, పోలీసులు తమకు శత్రువులు కారని, ఆదివారం నాటి దాడిలో తమ దళాలకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారని మావోయిస్టు పార్టీ ప్రకటించుకుంది. తమ చెరలోని జవాన్ ను విడుదల చేస్తామంటూ మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో కీలకమైన అంశాలను ప్రస్తావించింది. 'ఆపరేషన్ ప్రహార్-3' అనే పేరుతో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, దేశంలో హక్కుల ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రభుత్వాలు, పోలీసు బలగాలను ఉపయోగిస్తున్నాయని, పోలీసు బలగాలను తక్షణమే నిలిపివేయాలని మావోలు లేఖలో డిమాండ్ చేశారు. అదే సమయంలో మధ్యవర్తులను సూచించినట్లయితే జవాన్ ను విడిచిపెడతామని చెప్పారు. ఈలోపే దాడి ఘటనకు సంబంధించిన ఓ డ్రోన్ వీడియోను నక్సల్స్ విడుదల చేశారు. బుధవారం మధ్యాహ్నం జవాన్ రాకేశ్వర్ సింగ్ ఫొటోను కూడా బయటపెట్టారు. మొత్తంగా గడిచిన నాలుగు రోజులుగా మావోయిస్టులు భిన్నవాదనలను వినిపిండంలో దాదాపు సక్సెస్ అయ్యాయి. కాగా,

అడవిలోకి వెళ్లిన మధ్యవర్తులు..
బీజాపూర్ ఎన్‌కౌంటర్ సందర్భంగా మావోయిస్టులు తమ బందీగా చేసుకున్న జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ విడుదల కోసం చర్చలు మొదలయ్యాయి. 'జైలు బందీ విడుదల కమిటీ'లోని ఐదుగు సభ్యులు మధ్యవర్తులుగా వ్యవహరించేందుకు రెండు పక్షాలూ అంగీకరించడంతో చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. కమిటీలోని ఐదుగురు సభ్యులు బుధవారం సాయంత్రానికే గ్రౌండ్ జీరోకు బయలుదేరారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోని సోరి కూడా ఈ బృందంలో ఉన్నారు. వీరు నక్సలైట్లతో సమావేశమై చర్చలు జరుపుతారు. అలాగే వారి డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తారు.

తెలంగాణ సరిహద్దులో విడుదల?
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో పోలీసుల కూంబింగ్ ఎక్కువగా ఉండడంతో కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ ను తెలంగాణ సరిహద్దుల్లోనే అప్పగించే యోచనలో మావోయిస్టులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మధ్యవర్తుల కమిటీ ఇప్పటికే బీజాపూర్ బయల్దేరి వెళ్లింది. ఈ బృందంతో పాటు సామాజిక కార్యకర్త సోని సోరితోపాటు కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications