కలాం బదులు, మోదీకి సీఎం శ్రద్ధాంజలి (వీడియో)
న్యూఢిల్లీ: ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పైగా బీజేపీ సీనియర్ లీడర్, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం మరణించారని తెలుసుకుని విలేకరుల సమావేశం పెట్టారు. ఆ సందర్బంలో కలాంకు బదులుగా ప్రధాని, తమ పార్టీ నేత నరేంద్ర మోడీకి శ్రద్ధాంజలి ఘటించారు.
ఆయన ఎవరో కాదు చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్. అబ్దుల్ కలాం మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి రమణ్ సింగ్ జాతీయ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో కలాం మరణించారని చాల బాధగా ఉందని చెప్పారు.
ఆ సందర్బంలో ఆకస్మికంగా మనందరిని వదిలి పెట్టి వెళ్లిన నరేంద్ర మోడీ జీకి శ్రద్ధాంజలి అన్నారు. విలేకరులు షాక్ కు గురైనారు. తరువాత తేరుకున్న రమణ్ సింగ్ క్షమించాలని పొరపాటున మోడీ పేరు వచ్చేసిందని అన్నారు. కలాం అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అమ్మాయిలతో కలిసి డ్యాన్ వేసి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications