వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ జీ ఎందుకొచ్చారు.. అందుకేనా, ఛత్తీస్ గడ్ మంత్రి కాంట్రవర్సీ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోడీని ఛత్తీస్ గడ్ మంత్రి కవసి లక్మా ఏకిపారేశారు. గిరిజన నేత, మంత్రి నిన్న చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. తమ రాష్ట్రానికి మోడీ ఏం చేశారని అడిగారు. ఏమీ చేయలేదు అని దుయ్యబట్టారు. ఏదో అలా రాష్ట్రానికి వచ్చి వెళ్లారే తప్ప.. ఏమీ చేయలేదని మండిపడ్డారు. తమ రాష్ట్రంపై ఎందుకు వివక్ష చూపారాని ఆయన నిలదీశారు.

అసలు ఏం జరిగిందంటే..

అసలు ఏం జరిగిందంటే..

ఛత్తీస్ గడ్‌లో నీతి అయోగ్ ఎంపిక చేసిన 10 జిల్లాల్లో పనుల పురోగతి కోసం కేంద్ర మంత్రులు వస్తున్నారు. అయితే పదుల సంఖ్యలో రావడంతో.. లక్మా ఫైరయ్యారు. దీనిపై మీడియాతో మాట్లాడుతూ అగ్గి మీద గుగ్గిలంలా మండిపడ్డారు. పనుల కోసం ఇంత మంది మంత్రులు రావాలా అని అడిగారు. ఇదేం పద్దతి అంటూ విరుచుకుపడ్డారు. ఎన్నిసార్లు.. ఎంత మంది మంత్రులు పర్యటన చేస్తారు అని అడిగారు.

బాత్ రూం కోసం వచ్చారా..?

బాత్ రూం కోసం వచ్చారా..?

ఆ క్రమంలోనే మోడీని కూడా దుయ్యబట్టారు. రాష్ట్రానికి మోడీ కూడా రెండుసార్లు వచ్చారు.. ఏం చేశారని లక్మా అడిగారు. వచ్చి బాత్ రూమ్ వెళ్లారా అంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇక్కడి మట్టిని నాశనం చేశారని ఫైరయ్యారు. అయినా తమ రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. ఏదో అలా టిప్ టాప్‌లా వచ్చి భోజనం చేసి, టీ టిఫిన్ చేసి.. తమ డబ్బు వృథా చేస్తున్నారు అని విరుచుకుపడ్డారు. సమయం కూడా వేస్ట్ అయిపోతుందని చెప్పారు.

కామెంట్స్ వైరల్

కామెంట్స్ వైరల్

మోడీ లక్ష్యంగా చేసిన విమర్శలు దుమారం రేపాయి. వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. రకరకాల ట్రోల్ అవుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు మంత్రిని తప్పుపడుతుండగా.. మరొకరు ఏమీ చేయలేదని మంత్రి ఇలా ఆగ్రహాం వ్యక్తం చేశారని అంటున్నారు. కానీ మొత్తానికి మంత్రి చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. మరీ ఈ కామెంట్స్ నుంచి బీజేపీ నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలీ మరీ.

English summary
Chhattisgarh industry and excise minister Kawasi Lakhma sparked controversy with his remarks about Prime Minister Narendra Modi, “did ‘bathroom’ and spoiled our soil” without doing anything worth for the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X