మావోయిస్టుల హింస మధ్య ఛత్తీస్‌గడ్‌లో పోలింగ్
రాయపూర్: భారీ భద్రత, మావోయిస్టు దాడుల మధ్య ఛత్తీస్‌గడ్‌లో మొదటి దశలో 18 శాసనసభ నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం కొద్ది గంటల్లో బస్తర్, రాజనందగావ్ జిల్లాల్లో 10 - 12 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
బస్తర్‌లోని బలైంగా బూత్‌లో రిసైడింగ్ అధికారి రాజేంద్ర మహాపాత్ర గుండెపోటుతో మరణించినట్లు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ కుజూర్ చెప్పారు. అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో అతను పోలింగ్ బూత్‌లోని మరణించాడు. మారుమూల గ్రామం కావడంతో అక్కడికి అంబులెన్స్ చేరుకోవడం చాలా ఆలస్యమైంది.

మావోయిస్టు ప్రాబల్యం గల బస్తర్ జిల్లాలో భద్రతా బలగాలు విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టాయి. కాంకేర్ జిల్లాలోని పంఖజూర్ ప్రాంతంలో ఓ బాంబు దాడి జరిగింది. ఇందులో పోలీసు అధికారి గాయపడ్డాడు. అదే ప్రాంతంలో ఓ ప్రెషర్ బాంబును స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు.
కాగా, దంతేవాడ జిల్లాలో ఓ చోట మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు బిజాపూర్ మంకేలి ప్రాంతంలో రెండు రౌండ్ల కాల్పులు జరిగాయి. వివిధ ప్రాంతాల్లో చెదురుమొదరు సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, మొత్తంగా ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ ప్రజలు వోటింగ్‌లో పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications