వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛోటా రాజన్ చేతిలో 3 నకిలి పాస్ పోర్టులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాఫియా డాన్ ఛోటా రాజన్ మూడు నకిలి పాస్ పోర్టులు సంపాధించాడని సీబీఐ అధికారులు అంటున్నారు. అందులో ఒకటి కర్ణాటకలోని మండ్య పట్టణంలోని పాత ఎంసీ రోడ్డు, ఆజాద్ నగర్ అడ్రస్ తో ఉందని అధికారులు చెప్పారు.

తన పేరు పి. మోహన్ కుమార్, డోర్ నెంబర్ 107/బి, ఓల్డ్ ఎంసీ రోడ్డు, ఆజాద్ నగర్ మండ్య అడ్రస్ తో పాస్ పోర్టుకు అర్జీ సమర్పించాడు. పాస్ పోర్టు నెంబర్ జి 9273860ను 2008లో ఛోటా రాజన్ సంపాదించాడు. అప్పటి నుంచి నకిలి పాస్ పోర్టుతో ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాలలో సంచరిస్తున్నాడు.

ఛోటా రాజన్ నకిలి పాస్ పోర్టుతో సంచరిస్తున్నాడని భారత్ అధికారులు గుర్తించి ఇంటర్ పోల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పి. మోహన్ కుమార్ పేరుతో సంచరిస్తున్న ఛోటా రాజన్ అదే పాస్ పోర్టు ఉపయోగించి ఇండోనేషియాలోని బాలి చేరుకున్నాడు.

 Chhota Rajan got the passport from Harare in Zimbabwe.

విషయం గుర్తించిన బాలి విమానాశ్రయం సిబ్బంది కచ్చితమైన సమాచారంతోనే అతనిని అరెస్టు చేశారు. అయితే మండ్య పోలీసులు మాత్రం ఛోటా రాజన్ ఇక్కడి నుంచి పాస్ పోర్టు తీసుకోలేని వాదిస్తున్నారు.

ఛోటా రాజన్ మండ్య అడ్రస్ తో సంపాదించిన పాస్ పోర్టుతోనే అతను సంచరిస్తున్నాడు. మిగిలిన రెండు అడ్రస్ లతో అతను పలు దేశాలు సంచరించాడని సీబీఐ అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా, జింబాబ్వే దేశాలలో ఛోటా రాజన్ నకిలి పాస్ పోర్టులు సంపాధించాడని వెలుగు చూసింది.

English summary
Rajan told the CBI during interrogation that he decided to go to some other country when his attempt to get his Australian residency extended failed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X