ఛోటా రాజన్ ఆస్తులు రూ. 4,000 కోట్ల పైనే!
ముంబై: మాఫియా డాన్ ఛోటా రాజన్ తన చీకటి సామ్రాజ్యాన్ని పలు దేశాలలో విస్తరించి వేల కోట్ల రూపాయలు సంపాధించాడని ముంబై నగర పోలీసు అధికారులు అంటున్నారు. సుమారు రూ. నాలుగు వేల నుంచి రూ. ఐదు వేల కోట్లు సంపాదించాడని అంచనా వేశారు.
ఛోటా రాజన్ పెట్టుబడుల్లో సగానికి పైగా భారతదేశంలోను, అందునా ముంబై, దాని శివార్లలోనే ఉన్నాయి. సింగపూర్, థాయ్‌లాండ్ దేశాలలో కొన్ని బంగారు, వజ్రాల నగల దుకాణాలు, చైనాలో ఓ హోటల్, జకార్తాలో ఓ హోటల్ కూడా ఉన్నాయని ముంబై పోలీసు అధికారలు ఆధారాలు సేకరించారు.
అంతే కాకుండ ఆఫ్రికా దేశాలు, జింబాబ్వేలో వజ్రాల వ్యాపారం చేస్తున్నాడని అన్నారు. అందుకే జింబాబ్వే పారిపోయి అక్కడి అధికారుల సాయంతో అక్కడే ఆశ్రయం పొందడానికి ప్రయత్నించాడని పోలీసు అధికారులు చెప్పారు.
అయితే భారత్ ను కాదని ఆ దేశానికి చెందిన ఓ మాఫియా డాన్ కు ఆశ్రయం ఇవ్వడానికి జింబాబ్వే సిద్దంగా లేదని అన్నారు. జింబాబ్వే అధికారులతో భారత్ పోలీసు అధికారులు ఇప్పటికే ఛోటా రాజన్ గురించి చర్చించారు.

ఛోటా రాజన్ కు భారత్ లో మెరుగైన చికిత్స అందించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అతనికి హై సెక్యూరిటి ఇవ్వడానికి తాము సిద్దంగా లేమని తేల్చి చెప్పారు. ఈ విషయంలోనే ఛోటా రాజన్ భారత్ రావడానికి భయపడుతున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.
ఛోటా రాజన్ మీద భారతదేశంలో దాదాపు 75 కేసులు నమోదయ్యాయి. అందులో సుమారు 25 హత్య కేసులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అత్యంత కఠినమైన 'మోకా' చట్టం కింద కేసులు పెట్టారు. దీంతో ఒక్కసారి తమ చేతికి చిక్కితే కనీసం మూడేళ్ల పాటు కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉందని భారత్ పోలీసు అధికారులు అంటున్నారు.
తన మీద దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ దాడి చేసే అవకాశం ఉందని ఛోట రాజన్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అతను ప్రస్తుతం లివర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నాడు. కిడ్నీ వ్యాధి కారణంగా ప్రస్తుతం డయాలసిస్ చేయించుకుంటున్నాడు.
ఈ సందర్బంలో ప్రత్యర్థులు దాడులు చేస్తే ఛోట రాజన్ ఎదురుదాడి చేసే పరిస్థితులలో లేడని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం ఛోటా రాజన్ బినామి పేర్లతో ఉన్న రియల్ ఎస్టేట్ ఆస్తుల గురించి ముంబై పోలీసు అధికారులు పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications