వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ క్యాబ్ రేప్: డ్రైవర్‌పై చికాగో పోలీసుల దర్యాప్తు

By Pratap
|
Google Oneindia TeluguNews

చికాగో: మహిళా కస్టమర్‌పై అత్యాచారం జరిపాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆన్‌లైన్ సర్వీస్ ఉబేర్ క్యాబ్ డ్రైవర్‌పై చికాగో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయాన్ని వారు మంగళవారంనాడు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వార్తా కథనాలు జాతీయ మీడియాలో వ్చచాయి. తాము మహిళతోనూ ఉబేర్ అధికారులతోనూ మాట్లాడుతున్నామని చికాగో పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. అంతకు మించి వారు వివరాలు అందించలేదు.

సంఘటన అత్యంత భయంకరమైందని, అనంగీకారయోగ్యమైందని ఉబేర్ అధికార ప్రతినిధి జెన్నిఫర్ ముల్లిన్ అన్నారు. సంఘటన గురించి తెలియగానే తాము అతన్ని ఉద్యోగం నుంచి తొలగించామని, దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తున్నామని ఆమె అన్నారు. తాము తీసుకునే డ్రైవర్లపై గట్టి తనిఖీలు నిర్వహిస్తామని అన్నారు. ప్రబుత్వాధికారులతో ఇతర వ్యవహారాలకు సంబంధించి ఉబేర్ వార్తల్లోకి రావడంతో చికాగో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు చెబుతున్నారు.

 Chicago Police Investigating Rape Allegation Against Uber Driver

శుక్రవారం రాత్రి ఢిల్లీలో 27ఏళ్ల మహిళ క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా డ్రైవర్ మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్‌కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్‌లో పనిచేస్తోంది.

మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్‌ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు.

కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది. నిద్రమత్తులో కూడా ఉంది. ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు.

English summary
Chicago police said on Tuesday they are investigating an allegation that a driver for the online car service Uber raped a female customer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X