• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోడిగుడ్డు మీద 'ఈక' పీకడం కాదు.. యువతి మర్డర్ మిస్టరీ చేధించింది అదే మరి..!

|

ముంబై : కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం అనేది ఓ సామెత. ఇతరులపై ఆరోపణలు గుప్పించే సమయంలో వాడుతుంటారు. పోలీసుల దర్యాప్తుల్లో ఆలస్యమైతే కోడిగుడ్డు మీద ఈకలు పీకారు అని సంబోధిస్తారు. అంటే ఏమీ తేల్చలేదని అర్థం. అయితే తాజాగా ఓ మర్డర్ కేసులో మాత్రం కోడి ఈకనే ప్రధాన పాత్ర పోషించడం విశేషం.

సాధారణంగా పోలీసుల దర్యాప్తులో ఏ చిన్న ఆధారమైనా లైట్‌గా తీసుకోరు. తీగ లాగితే డొంక కదిలింది అనే చందంగా ప్రతి చిన్న క్లూ ను కూడా వదిలిపెట్టరు. అలాగే ఓ మర్డర్ కేసులో లభ్యమైన కోడి ఈక ఆధారంగా హంతకుడిని పట్టుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కీలక ఆధారాలు.. మర్డర్ మిస్టరీ వీడిందిలా..!

కీలక ఆధారాలు.. మర్డర్ మిస్టరీ వీడిందిలా..!

కోడి ఈక మర్డర్ మిస్టరీ చేధించింది. వినడానికి ఇది వింతగా ఉన్న వార్తలోకి వెళితే అసలు విషయం బోధపడుతుంది. మహారాష్ట్రలోని కల్యాణ్ టౌన్‌లో జూన్ 23వ తేదీన జరిగిన ఓ మర్డర్ పోలీసులకు సవాల్‌గా మారింది. పట్టణ శివారులోని కల్వర్టు దగ్గర సగం కాలిన యువతి డెడ్ బాడీ లభ్యమైంది. అయితే ఆ మర్డర్ ఎవరు చేశారనే విషయంలో తర్జనభర్జన పడ్డారు.

సదరు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ క్రమంలో చుట్టుపక్కల వెతికిన పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు దొరికాయి. అవే మర్డర్ మిస్టరీని చేధించాయి.

మంత్రికి వింత అనుభవం.. డబ్బా పీతలు తెచ్చి.. ఇంటిముందు కుమ్మరించి.. (వీడియో)

 కోడి ఈక.. తాయెత్తు.. దర్యాప్తులో వెలుగుచూసిన నిజాలు

కోడి ఈక.. తాయెత్తు.. దర్యాప్తులో వెలుగుచూసిన నిజాలు

స్పాట్‌లో కనిపించిన గోనెసంచిని నిశితంగా పరిశీలించిన పోలీసులకు కోడి ఈక కనిపించింది. దాంతో పాటే తాయెత్తు కూడా దొరికింది. కోడి ఈకను పట్టుకుని కూపీ లాగిన పోలీసులకు హంతకుడి వివరాలు లభించాయి. బెంగాలీ భాషలో రాసి ఉన్న తాయెత్తుతో డొంక కదిలించారు. ఆ రెండు ఆధారాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ఏరియాలో బెంగాలీవాళ్లు ఎవరున్నారని ఆరా తీసే క్రమంలో ఓ చికెన్ షాపు ఓనర్ గురించి తెలిసింది.

స్థానికంగా చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న ఆలం షేక్ అనే వ్యక్తి బెంగాలీవాడు అని తెలియడంతో ఆ కోణంలో దృష్టి సారించారు. అతడి గురించి ఆరా తీయగా.. యువతి డెడ్ బాడీ దొరికిన రోజు నుంచి కనిపించడం లేదని స్థానికులు తెలిపారు.

కూపీ లాగి.. నిందితుడిని అరెస్ట్ చేసి..!

కూపీ లాగి.. నిందితుడిని అరెస్ట్ చేసి..!

ఆ రెండు ఆధారాలు దొరకడం.. ఆలం షేక్ కనిపించకుండా పోవడం.. పోలీసుల అనుమానం నిజం చేశాయి. దాంతో థానే పోలీసులు అతడి స్వగ్రామానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నాడు నిందితుడు. తాను చంపిన యువతి పేరు మోని అని.. కొంతకాలంగా ఇద్దరం ప్రేమించుకున్నామని వివరించాడు.

మోని కుటుంబ అవసరాల నిమిత్తం తన దగ్గర రెండున్నర లక్షల రూపాయలు అప్పుగా తీసుకుందని.. తిరిగి చెల్లించే విషయంలో మొండికేసిందని చెప్పుకొచ్చాడు. దాంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవని.. ఆ క్రమంలో ఓ రోజు ఘర్షణ జరిగినప్పుడు కోపం పట్టలేక చంపేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే డెడ్ బాడీని బయటకు తీసుకెళ్లి ఎవరూ గుర్తుపట్టకుండా చేసే క్రమంలో తన స్నేహితుడు సాయం చేశాడని వెల్లడించాడు. నిందితుడు ఆలం ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తుండగా.. అతడి స్నేహితుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chicken feathers stuck on a bag found near a burnt body helped the police in Maharashtra's Thane crack a murder case and arrest the accused. Last month, the police had found the body of a woman, about 25 years old, beneath a stream. During the probe, they found chicken feathers stuck on a gunny bag found near the body. They also found an amulet, with Bengali letters, with these two helped to trace out the convict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more