ఏం తాగి తీసావన్నా మూవీ.. ఇలా ఎక్కేస్తుంది.!

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ దృశ్యం 3. అనుకోకుండా చిక్కుల్లో పడిన ఓ సామాన్య కుటుంబం.. ఆ సమస్యల నుంచి బయట పడేందుకు ఏం చేసింది అనేదే స్టోరీ లైన్ తో 2013 లో దృశ్యం మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ కథకు కొనసాగింపుగా 2021 లో దృశ్యం 2 మూవీ తెరకెక్కింది. ఆ తర్వాత తాజాగా దృశ్యం 3 మూవీ రిలీజ్ అయింది. గత రెండు పార్ట్ లు మాదిరిగానే ఈ మూవీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ట్విస్టులతో చాలా అద్భుతంగా వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది.

దృశ్యం, దృశ్యం 2 మాదిరిగానే దృశ్యం 3 స్టోరీని కూడా సస్పెన్స్, ట్విస్టులతో రూపొందించి సూపర్ హిట్ సాధించారు మేకర్స్.. కేవలం 3 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది దృశ్యం 3 మూవీ. మోహన్‌ లాల్ కెరీర్‌ లో అత్యధిక వసూళ్లు సాధించిన L2 ఎంపురాన్ (రెండు రోజుల్లో రూ. 32.10 కోట్ల గ్రాస్) రికార్డును ఇది అధిగమించకపోయినప్పటికీ.. ఆయన ఇటీవలి చిత్రాలైన తుడరుమ్ (రెండు రోజుల్లో రూ. 14.30 కోట్లు), హృదయపూర్వం (రూ. 5.75 కోట్లు) కంటే ఎక్కువ వసూళ్లు దక్కించుకుంది దృశ్యం 3 మూవీ.

Drushyam3 Movie Crosses Rs 100 Crore Gross Collections Worldwide Just 3 Days Massive Hit Drushyam3

ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్న ఈ మూవీ త్వరలోనే ఇండోనేషియా మార్కెట్ కోసం రీమేక్ అవుతోంది. ఇలా ఇండోనేషియాలో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి మలయాళ చిత్రం దృశ్యం 3 కావడం విశేషం. ఈ రీమేక్ చిత్రం 2026 ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక దృశ్యం 3 సినిమాలో మోహన్ లాల్, మీనాతో పాటుగా ఎస్తేర్ అనీల్, అన్సీబా హాసన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఫుల్ రన్ లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డ్స్ ను అధిగమిస్తుందో వేచి చూడాలి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+