తులా రాశి, వృశ్చిక రాశి జూన్ నెల జాతక ఫలం పూర్తి వివరాలు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. తెలుగులో ఉన్న 12 రాశుల్లో తులా రాశి, వృశ్చిక రాశి వారి జూన్ నెల జాతక ఫలం ఎలా ఉందో పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ఫలితాలు గ్రహాల కదలికల ఆధారంగా ఉంటాయి. వ్యక్తిగత జాతకంలోని గ్రహ బలాన్ని బట్టి ఈ ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
తులా రాశి - (చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు)
తులా రాశి వారికి జూన్ నెలలో గ్రహాల అనుకూలత చాలా బాగుంది. జూన్ 2 తర్వాత ఏర్పడే గజకేసరి, గజలక్ష్మీ వంటి రాజయోగాల వల్ల అదృష్టం వీరి ఇంటి తలుపు తడుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి కాస్త పెరిగినప్పటికీ, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు లేదా జీతాల పెంపునకు సంబంధించిన సానుకూల వార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి సంస్థల నుండి ఆఫర్లు వస్తాయి. ధన ప్రవాహం బాగుంటుంది. గతంలో నిలిచిపోయిన బకాయిలు లేదా మొండి బకాయిలు వసూలవుతాయి.
కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం, అయితే అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న పాత మనస్పర్థలు తొలగిపోయి సామరస్యం పెరుగుతుంది. పెళ్లికాని వారికి వివాహ యోగం బలంగా ఉంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మితిమీరిన పనిభారం వల్ల మానసిక అలసట, ఒత్తిడి కలగవచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. శనివారం రోజున శివాలయంలో లేదా ఆంజనేయ స్వామి గుడిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి - (విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు)
వృశ్చిక రాశి వారికి జూన్ నెల ఒక పెద్ద టర్నింగ్ పాయింట్కాబోతోంది. జూన్ 2 వరకు అష్టమ స్థానంలో ఉండి ఇబ్బంది పెట్టిన గురుడు, ఆ తర్వాత భాగ్య స్థానంలోకి ఉచ్ఛ స్థితిలో ప్రవేశిస్తున్నాడు. ఇది మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. జూన్ మొదటి వారంలో ఉద్యోగంలో అధికారులతో వాదనలకు దిగకుండా ఓపికగా ఉండటం మంచిది. జూన్ 2 తర్వాత పరిస్థితులు పూర్తిగా మీ వైపు మారుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి, కెరీర్ పరంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. రాజకీయ, ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి మంచి పదవులు దక్కుతాయి.
కొద్దిరోజులుగా వేధించిన ఆర్థిక ఇబ్బందులు, ఆకస్మిక ఖర్చులు క్రమంగా తగ్గుతాయి. గురుడి అనుగ్రహం వల్ల 'ధన యోగం' పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా పాత అప్పులు తీర్చడానికి మార్గాలు సుగమం అవుతాయి. లాటరీలు, బెట్టింగుల వంటి ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఐదవ ఇంట శని సంచారం వల్ల పిల్లల చదువు లేదా ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఆందోళన ఉండవచ్చు. కానీ, తొమ్మిదవ ఇంట్లోని గురువు కుటుంబ సమస్యలకు పెద్దల సహాయంతో చక్కని పరిష్కారాలను చూపిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలు లేదా పుణ్యక్షేత్ర దర్శనాలకు ప్రణాళికలు వేసుకుంటారు. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి సరైన వైద్యం దొరికి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు రాకుండా ఆహార నియమాలు పాటించాలి. గురువారం దత్తాత్రేయ స్వామి లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం, వీలైతే పసుపు రంగు వస్తువులను లేదా అరటిపండ్లను దానం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications