దుబాయ్ బిలియనీర్ ప్రేమలో పడ్డ ‘ధురంధర్’ బ్యూటీ? రొమాంటిక్ కిస్ వీడియో వైరల్!

బుల్లితెర నటి, ఇటీవల ధురంధర్ సినిమాలోని 'శరారత్' పాటతో సోషల్ మీడియాను ఊపేసిన బ్యూటీ క్రిస్టల్ డిసౌజా ప్రేమ వ్యవహారం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. దుబాయ్‌కు చెందిన ఓ బిలియనీర్‌తో ఆమె ప్రేమలో పడిందంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఓ పార్టీలో వీరిద్దరూ కెమెరా ముందే చాలా సన్నిహితంగా కనిపించడం.. సదరు పారిశ్రామిక వేత్త క్రిస్టల్ డిసౌజా బుగ్గపై ముద్దు పెట్టడం లాంటి దృశ్యాలు ఉన్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

కెమెరా ముందే కిస్.. ప్రేమ వ్యవహారం లీక్!
ఇటీవల జరిగిన ఓ గ్రాండ్ పార్టీలో క్రిస్టల్ డిసౌజా తన స్నేహితులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. ఈ క్రమంలో ఆమె పక్కనే ఉన్న దుబాయ్ బిజినెస్‌మెన్ 'ఏపీ' ఒక్కసారిగా క్రిస్టల్ బుగ్గపై కిస్ చేశాడు. ఈ రొమాంటిక్ మూమెంట్‌ను అక్కడ ఉన్న ఎవరో సీక్రెట్‌గా వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి క్రిస్టల్, ఏపీ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ వైరల్ వీడియోపై అటు నటి క్రిస్టల్ డిసౌజా కానీ, ఇటు బిజినెస్‌మెన్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Krystle DSouza Dating Dubai Billionaire AP Romantic Kiss Video Goes Viral on Internet Full Details

దుబాయ్ లగ్జరీ కార్ల వెనుక ఉన్న అసలు కథ ఇదేనా?
క్రిస్టల్ డిసౌజా గతంలో గులామ్ అనే ఓ కోటీశ్వరుడైన వ్యాపారవేత్తతో దాదాపు మూడేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. బ్రేకప్ అనంతరం క్రిస్టల్, ఏపీలు తరచూ ఒకరి ఇన్‌స్టాగ్రామ్ పోస్టులపై మరొకరు కామెంట్లు చేసుకోవడం గమనార్హం. అంతేకాదు క్రిస్టల్ ఇటీవల దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో తిరుగుతూ చేసిన వీడియోలను షేర్ చేసింది. ఆ లగ్జరీ కార్లన్నీ ఏపీకి చెందినవేనని, వారిద్దరి మధ్య ఎప్పటి నుంచో లవ్ ట్రాక్ నడుస్తోందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.

ఎవరీ బిలియనీర్ బిజినెస్‌‌మెన్ ఏపీ?
క్రిస్టల్ డిసౌజాతో వార్తల్లో నిలిచిన ఏపీ (AP) దుబాయ్‌లో లగ్జరీ కార్ల బిజినెస్ చేసే పెద్ద బిలియనీర్. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లను అమ్మడం, అలాగే వాటిని రెంట్‌కు ఇవ్వడం ఇతని ప్రధాన వ్యాపారం. ఏపీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'దేశీ బ్లింగ్'లో కూడా కనిపించి తన రాయల్ లైఫ్‌స్టైల్‌ను ప్రపంచానికి చూపించాడు. గతంలో ఇతడు ప్రముఖ ఇంటర్నెట్ పర్సనాలిటీ పమేలా సెరెనాతో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు బాలీవుడ్ ముద్దుగుమ్మ క్రిస్టల్‌తో కెమెరా ముందు రొమాన్స్ చేయడంతో మరోసారి వార్తల్లోకి వచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+