India-US deal: ఇది అసలు ఒప్పందమే కాదు..! తేల్చేసిన మాజీ ఆర్ధికమంత్రి..!
భారత్-అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం (india-us deal)పై ఓవైపు అధికార ఎన్డీయే సంబరాలు చేసుకుంటుంటే.. విపక్షాలు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇందుకు గల కారణాలను కూడా విపక్ష నేతలు గణాంకాలతో సహా విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం (chidambaram) కూడా స్పందించారు. అమెరికాతో భారత్ కుదుర్చుకుంది అసలు డీలే కాదని, ఇది కనీసం మధ్యంతర ఒప్పందం కూడా కాదని తెలిపారు.
భారత్-అమెరికా జారీ చేసిన ఉమ్మడి ప్రకటన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) కుదరలేదని స్పష్టం చేస్తోందని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తాత్కాలిక ఒప్పందం కూడా కాదని, ఇది 'మధ్యంతర ఒప్పందం కోసం ఒక ప్రేమ్ వర్క్ (చట్రం) మాత్రమేనని తేల్చిచెప్పేశారు. ఈ ప్రకటనలోని పేరా 2తో పాటు బుల్లెట్ పాయింట్లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గతేడాది ఏప్రిల్ 2, సెప్టెంబర్ 5, 2018 మార్చి 8న అమెరికా జారీ చేసిన ఆదేశాల్ని చూడకపోతే.. గతేడాది జూలై 30, 2019 మే 17న ఆ దేశం ఇచ్చిన హామీలు అర్ధం కావన్నారు.

ఇందులో ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉందని, అది ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం అమెరికాకు అనుకూలంగా ఎక్కువగా వంగి ఉందని, అసమానత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఉదాహరణకు భారత్.. అన్ని అమెరికా పారిశ్రామిక వస్తువులు, విస్తృత శ్రేణి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తొలగిస్తుంది లేదా తగ్గిస్తుందని, అయితే అమెరికా భారత్ నుండి వచ్చే వస్తువులపై 18 శాతం సుంకాన్ని విధిస్తుందని గుర్తుచేశారు.

My preliminary view on the Joint Statement on Tariffs:
— P. Chidambaram (@PChidambaram_IN) February 7, 2026
The Joint Statement issued by India and the US makes it clear that no Bilateral Trade Agreement (BTA) has been reached.
It is not even an Interim Agreement. It is a 'framework for an interim agreement'.
Paragraph 2 and…
ఈ వస్తువులలో వస్త్రాలు, తోలు వస్తువులు, సేంద్రీయ రసాయనాలు మొదలైనవి ఉంటాయన్నారు. మధ్యంతర ఒప్పందం విజయవంతంగా ముగిసిన తర్వాత మాత్రమే అమెరికా సుంకాన్ని తొలగిస్తుందన్నారు. కొన్ని విమానాలు మరియు విమాన భాగాలపై తప్ప ఉక్కు, రాగి, అల్యూమినియంపై అమెరికా సుంకాలు స్పష్టంగా కొనసాగుతాయన్నారు. సెక్షన్ 232 కింద అమెరికా చేస్తున్న దర్యాప్తు కొనసాగుతుందని, ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం ఆ దర్యాప్తుకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. కాబట్టి ఇందులో సంబరాలు జరుపుకునేందుకు ఏముందన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications