Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

citizenship amendment bill: రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టుకే అంటూ చిదంబరం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు.

పార్లమెంటులో పౌరసత్వ బిల్లు ఆమోదం పొందితే ఇక సుప్రీంకోర్టులోనూ ఆ విషయంపై తేల్చుకుంటామని చిదంబరం వ్యాఖ్యానించారు. పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు న్యాయవాదులు, న్యాయమూర్తులకు అనుకూలంా తమ బాధ్యతలనువిరమించుకుంటున్నారని చిదంబరం ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Chidambaram: CAB unconstitutional, battle will shift to Supreme Court

పార్టీకి ఇచ్చిన భారీ మెజార్టీకి మూల్యం చెల్లించుకుంటున్నామని అన్నారు. తమకు లభించిన మెజార్టీని పార్టీలను, ప్రజలను అణగదొక్కడానికి ఉపయోగించుకుంటున్నారని చిదంబరం ఆరోపించారు.

ఇటీవల కర్ణాటకలో వెలువడిన ఉపఎన్నికల ఫలితాలపైనా చిదంబరం తీవ్రంగా స్పందించారు. ఒక పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఓటు వేస్తారు.. అదే అభ్యర్థి బీజేపీలో చేరినా ఓటు వేస్తారని అన్నారు. ఇండియా అంటే స్వర్గమని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు మాత్రమే రావడంపై చిదంబరం అసంతృప్తి వ్యక్తం చేశారు.

పౌరసత్వ బిల్లుపై అమిత్ షా ఏమన్నారంటే..

ముస్లింలపై వివక్ష తమ ఉద్దేశం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా సోమవారం రాత్రి అమిత్ సమాధానమిచ్చారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో ముస్లింలు మైనార్టీలుగా లేరని అందుకే వారిని.. ఈ సవరణ బిల్లు ద్వారా దేశంలోకి అనుమతించడం లేదని తేల్చి చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో భారతీయులందరికీ రక్షణ ఉంటుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. మైనార్టీలుగా ఉన్న హిందువులు, సిక్కులు, పార్సీలు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు ఆ దేశాల్లో ఉండలేని పరిస్థితిల్లోనే మనదేశానికి వస్తున్నారని, అందుకే వారికి పౌరసత్వం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

ఆర్టికల్ 14కు ఈ బిల్లు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరుపై అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీనే దేశాన్ని మత ప్రాదికన విభజించిందని ధ్వజమెత్తారు. మహాత్మాగాంధీ విభజనకు అనుకూలం కాదని అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు వల్ల భారతీయు ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. శ్రీలంక తమిళీయులకు పౌరసత్వం ఉందని ఆయన తెలిపారు. బెంగాళీ హిందువులు మన దేశానికి రావడం ఇష్టం లేదా? అంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని పరోక్షంగా ప్రశ్నించారు అమిత్ షా.
అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు ఇన్నర్ లైన్ ప్రొటెక్ట్ కల్పిస్తామని చెప్పారు. బిల్లు అమల్లోకి తీసుకొచ్చే సమయంలో మణిపూర్ రాష్ట్రాన్ని కూడా ఇన్నర్ లైన్ ప్రొటెక్షన్ కింద చేరుస్తామని చెప్పారు. అలాగే త్రిపుర, అస్సాం ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమిత్ షా వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఈ రాష్ట్రాల్లోని ప్రత్యేక తెగలు, సముదాలయాల గురించి కూడా ఆలోచిస్తోందని చెప్పారు. అస్పాం ప్రజల కోసం ఒక ప్రత్యేక కమిటీ వేస్తామని చెప్పారు. దేశంలోకి రోహింగ్యాలను అనుమతించేది లేదని అమిత్ షా స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+