వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధార్‌పై సుప్రీం తీర్పు బిజెపికి చెంపదెబ్బ: కాంగ్రెస్

ఆధార్‌పై సుప్రీం ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది.ఈ తీర్పుబిజెపికి చెంపదెబ్బ అని అభివర్ణించింది.ఆధార్ కాన్సెప్ట్‌లో లోపం లేదని కాంగ్రెస్ ప్రకటన

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత కూడ ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది.యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ పథకంలో ఎలాంటి లోపం లేదని, వ్యక్తిగత గోప్యతకు ఇది విరుద్దం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం చెప్పారు.

ప్రస్తుత ప్రభుత్వమే వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే తరహలో ఆధార్‌ను దుర్వినియోగం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రైవసీ హక్కుకు అనుగుణంగా ఆధార్ పథకాన్ని తీసుకొచ్చాం. ప్రస్తుత ప్రభుత్వం ఆర్టికల్ 21కి ఇచ్చిన నిర్వచనమే వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘిస్తోందన్నారు.

Chidambaram slams Modi govt over Aadhaar, says Centre invaded 'Right To Privacy'

ఆధార్ కాన్పెప్ట్‌లో ఎలాంటి లోపం లేదు. ఆధార్‌ను ఒక సాధనంగా వాడుకోవాలన్న, దుర్వినియోగం చేయాలన్న ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. సుప్రీంకోర్టు నిర్ణయం ఫాసిస్ట్ శక్తులకు ఎదురుదె్బ్బగా ఆయన చెప్పారు.

బిజెపి బావజాలానికి ఇది తిరస్కృతి అని రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో ఆధార్‌కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

English summary
Soon after the Supreme Court held Right to privacy as a fundamental right, former union minister P Chidambaram slammed the BJP government for its intention to use 'Aadhaar as a tool'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X