వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకటి కాదు రెండు కాదు 20 సార్లు అరెస్ట్ నుంచి ఎస్కేప్.. ఇదీ చిదంబరం, కార్తీ పిటిషిన్ల పరంపరం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని వెంటాడుతుంది. ఐఎన్ఎక్స్ మీడియాలో పెట్టిన విదేశీ పెట్టుబడులు రూ.305 కోట్లు అక్రమమని దర్యాప్తు సంస్థలు ఎఫ్ఐఆర్ నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో ఇప్పటికే చిదంబరం కుమారుడు కార్తీని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా అధిపతి పీటర్ ముఖర్జీ అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి కేంద్ర మంత్రి చిదంబరంను విచారించేందుకు సీబీఐ, ఈడీ అధికారులు లుక్ ఔట్ నోటీసులు జారీచేశారు.

ముందస్తు బెయిల్‌కు నో ..

ముందస్తు బెయిల్‌కు నో ..

ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చిదంబరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ న్యాయస్థానం నిరాకరించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పినా .. చిదంబరం మొరను అలకించలేదు. దీంతో ఇవాళ ఉదయం నుంచి చిదంబరం బెయిల్ పిటిషన్ ఆసక్తికరంగా మారింది. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ అరెస్ట్ కాకుండా ఇప్పటికే 20 సార్లు తప్పించుకున్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించిన ప్రతీసారి కోర్టులు అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి.

<strong> ఐఎన్ఎక్స్ మీడియా కేసు: సుప్రీంకోర్టులో చిదంబరంకు చుక్కెదురు..కేసు రేపు విచారణ,అరెస్టయ్యే ఛాన్స్ </strong> ఐఎన్ఎక్స్ మీడియా కేసు: సుప్రీంకోర్టులో చిదంబరంకు చుక్కెదురు..కేసు రేపు విచారణ,అరెస్టయ్యే ఛాన్స్

రెండేళ్లలో 20 సార్లు ..

రెండేళ్లలో 20 సార్లు ..

2017, మే 15న ఐఎన్ఎక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. యూపీఏ హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన చిదంబరం, ఆయన కుమారుడు కార్తీపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇక అప్పటినుంచి ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో చిదంబరం, దర్యాప్తు సంస్థలు పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. కానీ గతేడాది ఎట్టకేలకు కార్తీని అరెస్ట్ చేశారు. పలు విడతలుగా అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చిదంబరం కోర్టులను ఆశ్రయిస్తునే ఉన్నారు.

స్టే .. స్టే

స్టే .. స్టే


మే 15, 2017 నుంచి దాదాపు రెండేళ్లలో అరెస్ట్ కాకుండా స్టే తెచ్చుకున్నారు చిదంబరం, ఆయన కుమారుడు. ఇప్పటికే కోర్టులు వారిద్దరికీ 20 సార్లు ఊరట కలిగింది. కానీ గతేడాది కార్తీ విచారణ తర్వాత .. నిధుల గోల్ మాల్ గురించి సీబీఐ, ఈడీ అధికారులు చిదంబరంపై ఫోకస్ చేశారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ చుక్కెదురు కావడంతో .. సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం కూడా వేగంగా పిటిషన్ విచారించలేమని స్పష్టంచేసింది.

English summary
While investigating agencies chase Chidambaram to arrest him and the Supreme Court hears his plea of protection from arrest, here are at least 20 times when P Chidambaram and his son Karti Chidambaram were able to get interim protection from arrest in the INX Media case and the Aricel Maxis case in the past two years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X