ఢిల్లీ ఏసీబీలో బీహార్ అద్దె పోలీసు అధికారులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ అవినీతిని అరికట్టడానికి అద్దె పోలీసులను తీసుకు వచ్చారు. బీహార్ రాష్ట్రం నుండి ముగ్గురు పోలీసు అధికారులను తీసుకు వెళ్లి ఢిల్లీలోని ఏసీబీలో కుర్చోపెట్టారు. క్రేజీవాల్ తీసుకున్న ఈ నిర్ణయం పలు చర్చలకు దారితీసింది.
అధికారుల నియామకం విషయంలో ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి క్రేజీవాల్ మద్య పెద్ద రాద్దాంతం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం కోర్టు వరకు వెళ్లింది. అయితే అవినీతిని పూర్తిగా అరికట్టడానికి క్రేజీవాల్ సిద్దం అయ్యారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను ఇటీవల క్రేజీవాల్ కలిశారు. ఢిల్లీకి పోలీసులను పంపించాలని విజ్ఞప్తిచేశారు. అందుకు నితీశ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అద్దె ప్రతిపాధికన పోలీసుల నియామకానికి అడ్డంకులు తొలగిపోయాయి.

ఢిల్లీ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉండటంతో క్రేజీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆప్ వర్గాలు అంటున్నాయి. అద్దె పోలీసు అధికారులలో ముగ్గురు ఇన్స్ పెక్టర్లు, ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు.
ఢిల్లీలో అవినీతిరహిత పాలన అందించడానికి క్రేజీవాల్ 24 మంది ఇన్స్ పెక్టర్లుతో సహ 600 మంది అధికారులు, సిబ్బందిని నియమించడానికి సిద్దం అయ్యారు. అయితే లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ విశేష అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికారులను నియమించకుండా అడ్డుకుంటున్నారని ఆప్ వర్గాలు విమర్శిస్తున్నాయి.












Click it and Unblock the Notifications