వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌కతాలో బాంబు పేలుడు, బాలుడు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బాంబు పేలుడు సోమవారం నాడు కలకలం సృష్టించింది. ఉత్తర కోల్‌కతాలో నాటు బాంబు పేలడంతో ఓ నాలుగేళ్లు బాలుడు మృతి చెందాడు.

ఘటనాస్థలంలో మరో రెండు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బాంబు పేలుడు కోల్‌కతాలోని తాలా ట్యాంక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో మరో బాలుడికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.

తీవ్రవాదులకూ ఉరిశిక్ష తగదు: శశిథరూర్‌

Child killed in crude bomb blast in Kolkata

ప్రభుత్వాలు హంతకుల్లా ప్రవర్తించకూడదని కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడు శశి థరూర్‌ పేర్కొన్నారు. ఉరిశిక్షను వ్యతిరేకించిన ఆయన తీవ్రవాదుల విషయంలోను ఇలాంటి చర్యలు తగదని పేర్కొన్నారు.

ఇందుకు బదులు ఎలాంటి విముక్తి కల్పించకుండా జీవితాంతం జైల్లో ఉంచాలన్నారు. హత్య చేసిన వ్యక్తిని చంపివేయాలనే భావన గతంలో ఉండేదని, అలాంటి విధానాన్ని ఇప్పుడు అనుసరించడమేంటన్నారు. ఆయన ఆదివారం తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్పందించారు.

English summary
A child died when two crude bombs went off in Tala Tank area of north Kolkata here on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X