చిన్న పిల్లలకు లైంగిక వేధింపులు: మీరూ ఇలా మద్దతివ్వండి

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: చిన్నపిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇందుకోసం కొందరు కొన్ని సందర్భాల్లో రూ.100 కూడా ఇస్తున్నారు.

రతి*కి 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమెకు హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో ఆమె వయస్సు ఎక్కువ కనిపిస్తోంది.

కొన్ని సమయాల్లో ఒక్క రోజులో 30 మంది మగవాళ్లతో సెక్స్‌లో పాల్గొనాలని ఆమెను బలవంతం చేసిన సందర్భాలు ఉన్నాయి.

Child Predators should be arrested

పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించినప్పుడు ఆమెతో పాటు వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్టు చేశారు. కానీ కస్టమర్లకు హెచ్చరికలు చేసి వదిలిపెట్టారు.

అందుకే ఇలాంటి అనాగరికులను కూడా అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ పిటిషన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాను. మీరు కూడా మద్దతు ఇస్తూ ఈ పిటిషన్ పైన సైన్ చేయండి.

పిల్లలతో శృంగారం జరిపే లేదా లైంగిక వేధింపులకు పాల్పడే ఎవరైనా అరెస్టు కావాలి. కానీ వీళ్లు మాత్రం ఓ వైపు పిల్లల జీవితాలను నాశనం చేస్తూ, మరోవైపు ఆనందంగా జీవిస్తున్నారు.

కస్టమర్ల రాక ఆగనంత వరకు ఇలాంటి దారుణమైన వ్యాపారం ఆగదు. కాబట్టి మొదట వారి రాక ఆగిపోవాలి. అందుకు వారిని కఠినంగా శిక్షించాలి.

అలాంటి కస్టమర్లు అరెస్టు కావాలి. వారి నిజరూపం ఈ సమాజానికి తెలియాలి. అప్పుడే ఇలాంటి అనాగరికుల నుంచి పిల్లలను కాపాడుకోగలుగుతాం.

ఈ ఉద్యమంలో నాతో చేయి కలపండి. మీ సహాయానికి ధన్యవాదాలు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Children are being preyed upon by men who sometimes pay as little as Rs.100 to have sex with a child.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X