వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరభారతాన్ని వణికిస్తున్న చలి...ఆలస్యంగా నడుస్తున్న 750 విమానాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తర భారత దేశాన్ని చలి వణికిస్తోంది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో మంచు వర్షం కురుస్తుండటంతో అక్కడ ఎముకలు కొరికే చలి వేస్తోంది. ఇక ఢిల్లీ నగరాన్ని మంచు దుప్పటి కప్పేయడంతో 760 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. మరో 19 విమానాలు రద్దు అయ్యాయి. మరో 100 రైళ్లు షెడ్యూల్‌కంటే రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఉష్నోగ్రతలు 6.4 డిగ్రీల సెల్సిసియస్‌గా రికార్డు అయ్యింది. కొన్ని చోట్లు సున్నా విజిబిలిటీ ఉన్నిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

చలి-పులి: గత 22 ఏళ్లల్లో అక్కడ ఎప్పుడూ లేనంత చలి.. ఎంతో తెలుసా..?చలి-పులి: గత 22 ఏళ్లల్లో అక్కడ ఎప్పుడూ లేనంత చలి.. ఎంతో తెలుసా..?

ఉత్తరభారతంలో విపరీతంగా ఉన్న చలి

ఉత్తరభారతంలో విపరీతంగా ఉన్న చలి

పాలం ప్రాంతంలో విజిబిలిటీ సున్నాగా ఉండగా సఫ్దార్‌జంగ్‌లో 300 మీటర్లుగా ఉండి ఆ తర్వాత క్రమంగా పెరిగినట్లు తెలిపారు. దీంతో పలు విమానాసర్వీసులు రైళ్లు రద్దు అయ్యాయి.ఇక శుక్రవారం రోజున గరిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సీజన్‌లో సగటున ఐదు డిగ్రీలు పడిపోయింది. ఇక ఉష్ణోగ్రతలు పడిపోవడం, గాలిలో తేమ పెరగడంతో ఢిల్లీలో కాలుష్యం లెవెల్స్ మళ్లీ పెరిగాయని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఢిల్లీలో శుక్రవారం ఉదయం 8 గంటలకు కాలుష్య తీవ్రత 430గా రికార్డు అయ్యింది . ఇక శనివారం రోజున ఢిల్లీలో స్వల్పంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న మంచు

హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న మంచు

ఇక హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం విపరీతమైన మంచు కురిసింది. దీంతో పాటు వర్షాలు కూడా పడ్డాయి. మరోవైపు కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా కాస్త పెరిగాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కీలాంగ్ ప్రాంతంలో 5 సెంటీమీటర్ల మంచు కురవగా, గందోలాలో 3 సెంటీమీటర్లు, కినౌర్‌లోని కల్పా ప్రాంతంలో ఒక సెంటీమీటరు మంచు కురిసిందని వెదర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. ఇక కీలాంగ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 6 డిగ్రీలకు పడిపోగా.. కల్పాలో 0.7 డిగ్రీల సెల్సియస్ రికార్డు అయ్యింది.

మంచు కురుస్తుండటంతో హైవేని మూసేసిన అధికారులు

మంచు కురుస్తుండటంతో హైవేని మూసేసిన అధికారులు

ఇక జమ్మూకశ్మీర్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మంచు ఎక్కువగా కురుస్తుండటంతో జమ్మూ-శ్రీనగర్ హైవేను అధికారులు మూసివేశారు. దీంతో కొన్ని వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. కశ్మీర్‌కు గేట్‌వేగా ఉండే జవహర్ టనెల్ వద్ద 6ఇంచిల మేరా మంచు కురిసిందని అధికారులు తెలిపారు. ఇర లడఖ్‌లోని ద్రాస్ బెల్టులో ఉష్ణోగ్రతలు మైనస్ 16.1కు చేరాయి. మరోవైపు జమ్మూ ప్రాంతంలోని బనిహాల్ బెల్టులో మైనస్ 1.5 డిగ్రీల సెల్సియస్ రికార్డ్ అయ్యింది. కశ్మీర్‌లోని గుల్మార్గ్ బెల్టులో మైనస్ 6.5 డిగ్రీల సెల్సిసియస్ రికార్డు అయ్యింది. ఇక హర్యానా పంజాబ్‌లలో కూడా చలిగాలులు వీస్తున్నాయి. హిస్సార్‌లో ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డు అయ్యింది.

English summary
Bone-chilling cold conditions prevailed in North India on Friday with fresh snowfall in Jammu and Kashmir and Himachal Pradesh, as a foggy morning in Delhi delayed 760 flights and led to cancellation of 19, while over 100 trains remained up to two hours behind schedule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X