• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా క్యాబేజీ వ్యూహం .. ఇండియాతోనూ అదే స్ట్రాటజీ ..ఇప్పటివరకు డ్రాగన్ కంట్రీ ఆక్రమణల గుట్టు ఇదే..

|

ఆక్రమణలకు డ్రాగన్ ది పెట్టింది పేరు. పొరుగుదేశాలతో పంచాయతీలుపెట్టుకోవడం, కయ్యానికి కాలు దువ్వడం,కొద్దికొద్దిగా పొరుగుదేశాల భూభాగాలను ఆక్రమించడం చైనాకు అలవాటుగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో చైనా వ్యవహారంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఒకపక్క ఇండియాలో గాల్వాన్ లోయ ఘర్షణతో చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొనివచ్చే ప్రయత్నం చేస్తుందని అర్థమైంది. ఇదే సమయంలో మరోవైపు జపాన్ ను కవ్విస్తున్న చైనా మొదటినుంచి క్యాబేజీ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలీ వ్యూహమేంటి? చైనా ఏం చేస్తుంది?ఎలా ఇతర దేశాల భూములను ఆక్రమిస్తుంది అంటే...

  #IndiaChinaFaceOff : Galwan Valley లో China రహస్య నిర్మాణాలు.. వెలుగుచూసిన Satellite చిత్రాలు!

  చైనాతో యుద్ధం తధ్యమా !! జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఆదేశాలతో టెన్షన్.. రీజన్ ఇదే !!

  నిదానంగా కొద్ది కొద్దిగాపొరుగు దేశాల భూములను ఆక్రమిస్తున్న చైనా

  నిదానంగా కొద్ది కొద్దిగాపొరుగు దేశాల భూములను ఆక్రమిస్తున్న చైనా

  ఇప్పటివరకు చైనా లక్ష చదరపు కిలోమీటర్ల ఇతర దేశాల భూభాగాన్ని ఆక్రమించిందని ఒక అంచనా. ఆక్రమణలలో చైనాది ఒక కొత్త స్ట్రాటజీ. పొరుగుదేశాలతో పేచీలు పెట్టుకొని , వారిని రెచ్చగొట్టి, యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి, నిదానంగా కొద్దిపాటి భూభాగాన్నిఆక్రమించి తనదే అనిపించుకుంటుంది. కొద్దిపాటి భూమికే ఏం యుద్ధం చేస్తామని భావించి ఊరుకున్న పరిస్థితులను చైనా అడ్వాంటేజ్ గా తీసుకుని ఆక్రమణలు చేస్తుంది. ఇక యుద్ధాలు వచ్చే స్థాయిలో ఆక్రమణలకు సాహసం చేయదు చైనా.

   ఏ దేశం మార్చనన్ని మ్యాపులు మార్చిన చైనా

  ఏ దేశం మార్చనన్ని మ్యాపులు మార్చిన చైనా

  చిన్నచిన్న భూభాగాలను నిదానంగా తన ఖాతాలో వేసుకుంటూ కొద్దికొద్దిగా ముందుకు జరుగుతుంది చైనా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటివరకు చైనా మార్చినన్ని మ్యాపులు మరే దేశం మార్చలేదు అంటే అతిశయోక్తి కాదు. అంతగా చైనా పొరుగు దేశాల భూములను ఆక్రమించింది. పొరుగు దేశాల చిన్నచిన్న ప్రాంతాలను కలుపుకొని తమవని చెప్పుకొని నిదానంగా వాటిని తమ అధీనంలోకి తెచ్చుకోవడమే చైనా అనుసరిస్తున్న క్యాబేజీ వ్యూహం .దీనిని సైనిక పరిభాషలో సలామీ స్లైసింగ్ అంటారు.

  ఇండియా విషయంలోనూ చైనా చేస్తున్నది అదే

  ఇండియా విషయంలోనూ చైనా చేస్తున్నది అదే

  చిన్నచిన్న ప్రాంతాలను నిదానంగా ఆక్రమించడం,వాటిపై అభ్యంతరం చెబుతూ పొరుగు దేశాలు యుద్దానికి దిగితే శాంతి చర్చల పేరుతో వారితో సంప్రదింపులు జరపడం, ఆ తర్వాత వేయగలిగితే కొద్దిపాటి భూభాగాన్ని ఆక్రమించి పాగా వేయడం, లేదంటే వెనక్కి తగ్గడం. ఇది చైనా స్ట్రాటజీ. ఇలా చైనా ఇప్పటివరకూ లక్ష చదరపు కిలోమీటర్లకు పైగా పొరుగు దేశాల భూభాగాన్ని ఆక్రమించింది. ఇప్పుడు ఇండియా విషయంలోనూ చైనా చేస్తున్నది అదే .భారత్ లోని గాల్వాన్ లోయ , పాంగాంగ్ సో సరస్సుల వద్ద ఇదే క్యాబేజీ వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది చైనా.

   గాల్వాన్ లోయ , పాంగాంగ్ సో సరస్సుల వద్ద చైనా క్యాబేజీ వ్యూహం

  గాల్వాన్ లోయ , పాంగాంగ్ సో సరస్సుల వద్ద చైనా క్యాబేజీ వ్యూహం

  పాంగాంగ్ సో లోని ఫింగర్ 4 తనదేనని కొత్త వాదన అందుకున్న చైనా, అక్కడ వరకు రావడానికి వారికి అనుకూల పరిస్థితులు ఉండటంతో ముందుకు వచ్చేసింది. ఇక భారత్ కు ఫింగర్ 4 శిఖరానికి చేరడానికి నిట్టనిలువునా కొండ ఎక్కాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో చైనా ఫింగర్ 4 తమదేనని చెబుతోంది. ఇక గాల్వాన్ లోయ ఎప్పుడూ భారత్ స్వాధీనం లోనే ఉంది. అయితే భారత్ దౌలత్ బేగ్ ఒల్డీకు రహదారి నిర్మాణం చేపట్టడంతో గాల్వాన్ లోయ కూడా తమదేనని వచ్చిన చైనా ఆక్రమణకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత్ గట్టిగా బుద్ధి చెప్తున్న నేపథ్యంలో కొత్తగా చర్చల రాగం అందుకున్న చైనా తన వక్రబుద్ధి పోనివ్వకుండా భారత్ లో దురాక్రమణకు పాల్పడే ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉంది.

  English summary
  One estimate is that China has occupied the territory of other countries for a million square kilometers. China is a new strategy in the land occuppies. It fights with its neighbors, provokes them, creates a war atmosphere, and gradually conquers little area. China is taking advantage of the situation and taking over the occupies, considering what little war will be fought. China will no longer resort to aggression in the face of war.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more