• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దుల్లో మాటు వేసిన చైనా: 1962 నాటి యుద్ధ వాతావరణం: టిబెట్ రీజియన్‌లో భారీ నిర్మాణాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటానికి కారణమౌతోన్న డ్రాగన్ కంట్రీ చైనా.. తన వైఖరిని మార్చుకోవట్లేదు. దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే వస్తోంది. భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూనే ఉంది. దాదాపుగా ఏడాదిన్నర కాలంగా లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి కారణమౌతోన్న చైనా.. తన దూకుడును కొనసాగిస్తోంది. తగ్గించుకోవట్లేదు. ఈ తరహా వాతావరణాన్ని నియంత్రించుకోవడానికి రెండు దేశాలు కూడా దశలవారీగా కమాండర్ స్థాయి చర్చలను కొనసాస్తూనే.. సరిహద్దుల్లో తన సైనిక బలగాలను బలోపేతం చేసుకుంటోంది. భారీ నిర్మాణాలకు పూనుకుంటోంది.

Recommended Video

India-China Standoff : భారత్‌ను రెచ్చగొడుతున్న China,Tibet రీజియన్‌లో భారీ నిర్మాణాలు!

పాలెం బస్సు దుర్ఘటనను గుర్తు చేసిన ఘోర ప్రమాదం: 12 మంది సజీవ దహనం: స్పందించిన మోడీపాలెం బస్సు దుర్ఘటనను గుర్తు చేసిన ఘోర ప్రమాదం: 12 మంది సజీవ దహనం: స్పందించిన మోడీ

1962 నాటి యుద్ధ వాతావరణం..

1962 నాటి యుద్ధ వాతావరణం..

టిబెట్ రీజియన్‌లో చైనా పెద్ద ఎత్తున నిర్మాణాలకు పూనుకుందని, హెలిప్యాడ్లను సైతం సిద్ధం చేసుకుంటోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఓ నివేదికను అందజేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఈ నివేదికను ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి అందజేశారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ సభ్యులుగా ఉన్నారు. చైనా తన పరిధిని విస్తరించుకుంటోందని ఈ నివేదికలో అటార్నీ జనరల్ స్పష్టం చేశారు.

 హెలిప్యాడ్లు, రన్‌వేలు, రైల్వే లైన్లు కూడా..

హెలిప్యాడ్లు, రన్‌వేలు, రైల్వే లైన్లు కూడా..

టికెట్ రీజియన్‌లో చైనా తన నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తోందని కేంద్రం తెలిపింది. ఎయిర్‌స్ట్రిప్స్, హెలిప్యాడ్స్, రోడ్లు, రైల్వే లైన్లను సైతం అందుబాటులోకి తీసుకుని వస్తోందని స్పష్టం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సరిహద్దుల్లో తాము కూడా రోడ్లను విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రిషికేష్-గంగోత్రి, రిషికేష్-మానా, తనక్‌పూర్-పితోర్‌గఢ్ మధ్య రోడ్లను మరింత విస్తరించాల్సి ఉందని వివరించింది. డెహ్రాడున్, మీరట్‌లల్లో ఆర్మీ క్యాంప్‌లను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. మిస్సైళ్లను ప్రయోగించే సామర్థ్యం ఉండేలా ఈ క్యాంప్‌లను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది.

యుద్ధ సామాగ్రిని తరలించడానికి..

యుద్ధ సామాగ్రిని తరలించడానికి..

సరిహద్దులకు యుద్ధ సామాగ్రిని తరలించడానికి రోడ్లను విస్తరించేలా ప్రతిపాదనలను రూపొందించుకున్నామని కేంద్రం సుప్రీంకోర్టు తెలియజేసింది. యుద్ధ ట్యాంకులు, యుద్ధ సామాగ్రి, జవాన్లకు అవసరమైన నిత్యావసర సరుకులు, సైన్యాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లే భారీ వాహనాలను సరిహద్దులకు తరలించడానికి అవసరమైన రోడ్లు అందుబాటులో లేవని, వాటిని విస్తరించుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. 1962 నాటి యుద్ధ పరిస్థితుల్లో వాటిని అత్యవసరంగా తరలించాల్సి వచ్చిందని పేర్కొంది. వాటిని తరలించడంలో సైన్యం ఇక్కట్లను ఎదుర్కొంటోందని తేల్చి చెప్పింది.

 లఢక్ వద్ద ఎనిమిది చోట్ల..

లఢక్ వద్ద ఎనిమిది చోట్ల..

లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఎనిమిది చోట్ల చైనా కొత్తగా నిర్మాణాలను చేపట్టింది. వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో ఉండే అవుట్ పోస్ట్ ప్రాంతాలవి. కొన్ని చోట్ల మోడ్యులర్ కంటైనర్ బేస్డ్ నిర్మాణాలను పూర్తి చేసింది కూడా. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల కోసం ఈ ఎనిమిది చోట్ల కొత్త షెల్టర్ల నిర్మాణాన్ని చేపట్టిందనే అభిప్రాయాలు ఉన్నాయి. గత ఏడాది పొడవునా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హాట్ స్ప్రింగ్స్‌తో పాటు ఛాంగ్ లా, టషిగోంగ్, మన్జా, ఛురుప్, కొరాకోమ్ పాస్ సమీపంలోని వాహబ్ ఝిల్గా వంటి చోట్ల కొత్తగా ఆర్మీ షెల్టర్లు వెలిసినట్లు చెబుతున్నారు.

3,488 కిలోమీటర్ల మేర.. నిర్మాణాలు..

3,488 కిలోమీటర్ల మేర.. నిర్మాణాలు..

భారత్-చైనా సరిహద్దుల పొడవు దాదాపు 3,488 కిలోమీటర్లు. లఢక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ రెండు దేశాలు సరిహద్దులను పంచుకుంటోన్నాయి. ఈ సరిహద్దుల వెంబడి కొన్ని కీలకమైన, వ్యూహాత్మకమైన లొకేషన్లలోనూ ఇవే తరహా నిర్మాణాలను చేపట్టింది చైనా. హోటన్, కష్గర్, గర్గున్సా, ల్హాసా-గొంగ్గర్, షిగాట్సే వద్ద ఈ తరహా కొత్త నిర్మాణాలను చేపట్టిందని పేర్కొంది. ఎయిర్ బేస్‌లల్లో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 మిస్సైళ్లు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ బ్యాటరీస్‌లను మోహరింపజేసినట్లు నిర్ధారించింది. గర్గున్సా వద్ద ఎస్-400 ఎక్సర్‌‌సైజెస్ చేపట్టినట్లు తెలిపింది.

English summary
The Centre on Tuesday told the Supreme Court that China has ramped up infrastructure in the Tibet region and the Army needs broader roads to move heavy vehicles up to the India-China border to avoid a 1962 war-like situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X