వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర తప్పిదం: పాక్ ఆక్రమిత కశ్మీర్.. పాకిస్తాన్ మ్యాప్ లోనా? ఈ మొబైల్ సంస్థకు మూడినట్లే!

చైనాకు చెందిన మొబైల్ మేకర్ వన్‌ప్లస్ భారత్ విషయంలో ఘోర తప్పిదం చేసింది. ఈ సంస్థ ఇటీవల ప్రదర్శించిన ఓ వీడియోలో భారతదేశ పటం నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తీసుకెళ్లి పాక్‌లో కలిపేసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత్ విషయంలో ఘోర తప్పిదం చేసింది. భారతదేశ పటం నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తీసుకెళ్లి పాక్‌లో కలిపేసింది. ఈ సంస్థ తన ఫ్లాగ్‌షిప్ మొబైల్ వన్‌ప్లస్ 5న ఇటీవల విడుదల చేసింది.

ఈ సందర్భంగా ఓ వీడియోను ప్రదర్శిస్తూ ప్రపంచంలో ఏయే నగరాల్లో పాప్-అప్ కార్యక్రమాలు నిర్వహించనున్నదీ వివరించింది. ఈ సందర్భంగా చూపించిన మ్యాప్‌లో భారత్‌లోని పాక్ ఆక్రమిత కశ్మీర్ మిస్సయింది.

oneplus-5

ఈ సంస్థ దానిని తీసుకెళ్లి పాకిస్థాన్‌లో కలిపేసింది. దీంతో భారత్ భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. దీనిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, వన్‌ప్లస్ సంస్థ న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో పాప్-అప్ కార్యక్రమాలు నిర్వహించనుంది.

ఈనెల 27 నుంచి వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను తమ ఎక్స్‌పీరియన్స్ స్టోర్ ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. అయితే భారత్ మ్యాప్ విషయంలో చేసిన తప్పిదంపై మాత్రం వన్‌ప్లస్ సంస్థ ఇప్పటి వరకు స్పందించలేదు.

English summary
China Mobile maker OnePlus committed a big mistake. On account of release of a new mobile OnePlus 5, this company exhibited an video and in that video it shown Pak Occupied Kashmir, a part of Indian Map.. in Pakistan's Map.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X