వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ పరిస్థితి పట్ల చైనా సానుభూతి.. అవసరమైన సాయానికి సిద్దమని ప్రకటన... మెడికల్ సప్లై కంపెనీలకు మార్గనిర్దేశం

|
Google Oneindia TeluguNews

కరోనాతో భారత్ విలవిల్లాడుతున్న వేళ ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతోంది. భారత్‌కు అవసరమైన సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకొస్తున్నాయి. తాజాగా చైనా కూడా భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ కష్ట కాలంలో భారత్‌కు అవసరమైన మెడికల్ సాయం అందించేందుకు చైనా కంపెనీలను ప్రోత్సహిస్తామని ప్రకటించింది. ఈ మేరకు చైనా రాయబార కార్యాలయం సోమవారం(ఏప్రిల్ 26) ఒక ప్రకటన విడుదల చేసింది.

భారత్ ఒంటరి కాదు.. కష్ట కాలంలో అండగా కదిలిన దేశాలు.. కరోనాపై ఫైట్‌కు ఇదీ అంతర్జాతీయ మద్దతు...భారత్ ఒంటరి కాదు.. కష్ట కాలంలో అండగా కదిలిన దేశాలు.. కరోనాపై ఫైట్‌కు ఇదీ అంతర్జాతీయ మద్దతు...

భారత్ పట్ల చైనా సానుభూతి...

భారత్ పట్ల చైనా సానుభూతి...

చైనీస్ రాయబార కార్యాలయ ప్రతినిధి వాంగ్ జియా జియాన్ మాట్లాడుతూ... కరోనాపై పోరులో భారత్‌కు అవసరమైన వైద్య సాయం,మెడికల్ సరఫరాలను అందించేందుకు చైనా కంపెనీలను ప్రోత్సహిస్తామని చెప్పారు. భారత అవసరాలకు అనుగుణంగా తగిన సాయం అందించేందుకు చైనా కంపెనీలకు మార్గనిర్దేశం చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న పరిస్థితుల పట్ల అత్యంత సానుభూతితో ఉన్నామని తెలిపారు.

అవసరమైన సాయానికి సిద్దం...

అవసరమైన సాయానికి సిద్దం...

భారత్‌లో కరోనా మహమ్మారి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ పేర్కొన్నారు. కరోనా కట్టడికి అవసరమైన సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. 'ప్రస్తుతం ఇరు దేశాలు పరస్పరం సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇప్పటికైతే చైనా యాంటీ ఎపిడెమిక్ మెడికల్ సప్లైని భారత కంపెనీలు కొనుగోలు చేసే విషయమై చర్చించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత అవసరాలేంటో చెబితే అందుకు అనుగుణంగా తగిన సాయాన్ని,మద్దతును అందించేందుకు చైనా సిద్దంగా ఉంది.' అని పేర్కొన్నారు.

ఆ ఎయిర్‌లైన్స్ తీరుపై...

ఆ ఎయిర్‌లైన్స్ తీరుపై...

ఓవైపు భారత్‌కు సాయం అందించేందుకు సిద్దంగా ఉన్నామని చైనా ప్రకటించగా... మరోవైపు చైనాకు చెందిన సిచువాన్ ఎయిర్‌లైన్స్ భారత్​కు 15 రోజులపాటు కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ తీవ్ర ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో చైనా ప్రభుత్వ ఆధీనంలో నడిచే సిచువాన్ ఎయిర్‌లైన్స్ ఈ నిర్ణయం తీసుకోవడంపై భారత్ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై తాజాగా చైనా విదేశాంగ మంత్రిని ప్రశ్నించగా... సంబంధిత ఎయిర్‌లైన్స్‌తో మాట్లాడుతామని చెప్పారు.కరోనా సెకండ్ వేవ్‌తో విలవిల్లాడుతున్న భారత్‌కు ఇప్పటికే యూకె,యూఎస్,జర్మనీ,ఆస్ట్రేలియా,ఫ్రాన్స్ తదితర దేశాలు సాయం చేసేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

Recommended Video

TN Assembly Elections : Celebrities Voting సోషల్ మీడియాలో వైరల్ | Rajinikanth, Ajith, Vijay

English summary
Chinese embassy on Monday extended its support to India in its fight against coronavirus. In a statement, the embassy’s spokesperson in India, Wang Xiaojian, said Chinese companies will be encouraged and guided to cooperate with India and facilitate acquiring of medical supplies according to India’s needs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X