చైనాకు చెక్ పెట్టేందుకే బడ్జెట్ పెంపు - డ్రాగన్ చెప్పేదొకటి, చేసేది మరోటి: రాజ్యసభలో రాజ్‌నాథ్
''అనేక దశాబ్దాలుగా చైనా తన సరిహద్దు ప్రాంతాలను విస్తరించుకుంటూ పోతున్నది. ఆ క్రమంలోనే వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)ని గుర్తించబోమంటూ భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నది. సరిహద్దు వెంబడి బలగాల మోహరింపుతోపాటు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల నిర్మాణాలు సైతం చేపట్టింది. చైనాకు చెక్ పెట్టేందుకు మనం కూడా మునుపటి కంటే రెట్టింపు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు పెంచి, ధీటుగా నిలబడ్డాం'' అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత, తూర్పు లదాక్ లో అనూహ్య ఘటనలు, సైనిక చర్చలు తదితర అంశాలపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. చైనా దురాక్రమణ యత్నాలు, కవ్వింపు చర్యలు రోజురోజుకూ పెరుగుతుండటం, డ్రాగన్ ను నియంత్రించడంలో మోదీ సర్కారు ఫెయిలైందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న నేపథ్యంలో రాజ్ నాథ్ ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 'చైనా సరిహద్దు' అంశంపై చర్చకు నో చెప్పిన కేంద్రం.. రక్షణ మంత్రి చేత సుమోటోగా ఉభయసభల్లో ప్రకటన చేయించింది. సరిహద్దు అంశంపై రెండ్రోజుల కిందట లోక్ సభలో స్టేట్మెంట్ ఇచ్చిన రాజ్ నాథ్.. గురువారం రాజ్యసభలోనూ దాదాపు అవే మాటలు రిపీట్ చేశారు. చెప్పేదొకటి, చేసేది మరోటి అన్నట్లుగా చైనా వ్యవహరిస్తున్నదన్నారు.
వివిధ ద్వైపాక్షిక తీర్మానాలకు, 1993, 1996లో చేసుకున్న ఒప్పందాలకు వ్యతిరేకంగా సరిహద్దుల్ని మార్చేందుకు చైనా నిత్యం ప్రయత్నిస్తున్నదని, తద్వారా సరిహద్దులో అశాంతిని రాజేస్తున్నదని రాజ్ నాథ్ తెలిపారు. అయితే, డ్రాగన్ ప్రయత్నాలపై భారత బలగాలు నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ధీటుగా సమాధానం ఇస్తున్నాయన్నారు. సరిహద్దులో శాంతి కోసం భారత్ కట్టుబడి ఉన్నప్పటికీ, చైనా అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications